క్రేజీ కాంబో.. సుకుమార్, బన్నీ వాస్ నిర్మాణంలో ప్రియదర్శి కొత్త సినిమా!
Sukumar: ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపి జాయింట్ ప్రొడక్షన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
క్రేజీ కాంబో.. సుకుమార్, బన్నీ వాస్ నిర్మాణంలో ప్రియదర్శి కొత్త సినిమా!
Sukumar: ప్రస్తుతం టాలీవుడ్‌లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలోని అగ్ర నిర్మాణ సంస్థలు చేతులు కలిపి జాయింట్ ప్రొడక్షన్స్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా ఇదే బాటలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు మోస్ట్ సక్సెస్‌ఫుల్ మేకర్స్ క్రేజీ కాంబినేషన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లెజెండరీ ఫిల్మ్‌మేకర్ సుకుమార్, స్టార్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ ఒక సరికొత్త ప్రాజెక్ట్ కోసం జంటగా మారారు.
సుకుమార్ రైటింగ్స్ & బన్నీ వాస్ వర్క్స్ కొలాబరేషన్!
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్‌కు చెందిన ‘సుకుమార్ రైటింగ్స్’, బన్నీ వాస్‌కు చెందిన ‘బన్నీ వాస్ వర్క్స్’ సంయుక్తంగా ఈ నయా ప్రాజెక్ట్‌ను నిర్మించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. టాలెంట్ ఉన్న నటీనటులను, వినూత్నమైన కథలను ప్రోత్సహించడంలో ఈ రెండు బ్యానర్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు వీరిద్దరూ కలిసి వర్సటైల్ యాక్టర్ ప్రియదర్శి హీరోగా ఒక క్రేజీ సినిమాను లైన్ లో పెట్టడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ప్రియదర్శి ఇప్పటికే కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక బలమైన ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు సుకుమార్ బ్రాండ్ ఇమేజ్, బన్నీ వాస్ ప్రొడక్షన్ వాల్యూస్ తోడు కావడంతో ఈ ప్రాజెక్ట్ పై అప్పుడే సినీ లవర్స్ లో భారీ క్యూరియాసిటీ మొదలైంది.
బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో మేకర్స్ జోష్
ఇటీవలే సుకుమార్ భారీ బడ్జెట్ అండ్ హై-వోల్టేజ్ మూవీ ‘పెద్ది’ నిర్మాణంలో భాగస్వామిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. మరోవైపు, బన్నీ వాస్ కూడా కొన్ని నెలల క్రితమే విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఈష’ సినిమా కోసం మరో ప్రొడక్షన్ హౌస్‌తో కలిసి సక్సెస్ ఫుల్ భాగస్వామ్యాన్ని పంచుకున్నారు.
మరోవైపు సుకుమార్, గ్లోబల్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన పాన్-ఇండియన్ బ్లాక్‌బస్టర్ ‘పుష్ప 2: ది రూల్’ ఘనవిజయం తర్వాత.. ప్రస్తుతం మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తో చేయబోయే తన తదుపరి భారీ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ వర్క్ ని సిద్ధం చేస్తున్నారు. ఈ బిజీ షెడ్యూల్స్ లోనే ప్రియదర్శి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.
త్వరలోనే పూర్తి వివరాలు..
ఒక వైపు సుకుమార్ క్రియేటివిటీ, మరోవైపు డిస్ట్రిబ్యూటర్ గా, ప్రొడ్యూసర్ గా ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన బన్నీ వాస్ జడ్జిమెంట్ కలవబోతున్న ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు? ఇందులో నటించబోయే ఇతర నటీనటులు , సాంకేతిక నిపుణులు ఎవరు? అనే వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.




