Avantika Sundar Wedding: ఖుష్బూ కుమార్తె వేడుకలో చిరు, నాగ్, వెంకీ!

Avantika Sundar Wedding: సీనియర్ నటి ఖుష్బూ సుందర్, దర్శకుడు సుందర్ సి కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

Srinivas Rao
Published on: 26 Jun 2026 11:46 AM IST
Avantika Sundar Wedding
X

Avantika Sundar Wedding: ఖుష్బూ కుమార్తె వేడుకలో చిరు, నాగ్, వెంకీ!

Avantika Sundar Wedding: సీనియర్ నటి ఖుష్బూ సుందర్ , ప్రముఖ దర్శకుడు సుందర్ సి కుమార్తె అవంతిక సుందర్ వివాహం గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్‌లో అత్యంత వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వేడుకకు దక్షిణాది , బాలీవుడ్ చిత్ర పరిశ్రమల నుంచి పలువురు దిగ్గజ నటులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

తారల మెరుపులు.. గోల్డెన్ థీమ్‌లో సందడి

ఈ వివాహ వేడుకలో చిరంజీవి, నాగార్జున, అమల, వెంకటేష్, త్రిష వంటి అగ్రనటులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు బాలీవుడ్ నటులు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ కూడా సందడి చేశారు. ఒక వైరల్ వీడియోలో అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్.. చిరంజీవి , వెంకటేష్‌తో సరదాగా నవ్వుతూ మాట్లాడుకోవడం ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ వేడుక కోసం 'గోల్డెన్' థీమ్‌ను ఎంచుకోవడంతో, హాజరైన వారంతా బంగారు వర్ణపు వస్త్రధారణలో మెరిసిపోయారు.

అతిథులు … ఆహ్వానాలు

ఖుష్బూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె పలువురు రాజకీయ నాయకులను, సినీ ప్రముఖులను వ్యక్తిగతంగా కలిసి ఆహ్వానించారు. ఇటీవల ఖుష్బూ, సుందర్ సి దంపతులు తమ కుమార్తెలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీని, చెన్నైలో ముఖ్యమంత్రి విజయ్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అయితే, వారి బిజీ షెడ్యూల్ కారణంగా ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు సమాచారం.

ఎవరు ఈ అవంతిక సుందర్?

అవంతిక సుందర్ త్వరలోనే నటిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టబోతున్నారు. సుజేష్ అన్నీ ఈపెన్ దర్శకత్వంలో రాబోతున్న మలయాళ చిత్రం 'ఆరంభం'తో ఆమె కథానాయికగా పరిచయం కానున్నారు. అదే సమయంలో, ధమో నాగభూషణం దర్శకత్వంలో వస్తున్న 'అటాకర్' అనే తమిళ చిత్రంతో కూడా ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు.

అవంతిక చెన్నైకి చెందిన మెర్చంట్ నేవీ ఆఫీసర్ శ్రవణ్ శ్రీనివాసన్‌ను వివాహం చేసుకున్నారు. ఇది "ప్రేమ , పెద్దల అంగీకారంతో జరిగిన వివాహం" అని, ఇరు కుటుంబాల వారు మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారని ఖుష్బూ గతంలో ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story