ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు..శోభిత ధూళిపాళ సంచలన కామెంట్స్!

Sobhita: నాగచైతన్యతో వివాహం, పెళ్లి తర్వాత పర్సనల్ లైఫ్, కెరీర్ బ్యాలెన్సింగ్ గురించి నటి శోభిత ధూళిపాళ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Gagan kumar
Published on: 27 Aug 2026 10:57 AM IST
Sobhita
X

ఇలాంటి రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు..శోభిత ధూళిపాళ సంచలన కామెంట్స్!

Sobhita: అక్కినేని నాగచైతన్యతో వివాహం తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన యంగ్ బ్యూటీ శోభిత ధూళిపాళ.. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ జోరు పెంచింది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్‌లతో అలరిస్తున్న ఈ భామ, సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శోభిత.. చైతుతో తన పెళ్లి, వివాహబంధం, ఎదురైన సవాళ్లపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.

పెళ్లయిన వెంటనే తనకు తమిళనాడులో సినిమా షూటింగ్ ప్రారంభమైందని శోభిత తెలిపింది. పెళ్లైన కొత్తలోనే వేర్వేరు ప్రాజెక్ట్‌ల వల్ల నేను, చైతు నెలకొకసారి మాత్రమే కలిసేవాళ్లం. ఇద్దరం సినీ ఫీల్డ్‌లోనే ఉండటంతో వైవాహిక జీవితాన్ని, కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడం మొదట్లో చాలా కష్టంగా అనిపించిందని చెప్పుకొచ్చింది.

అయితే కొద్ది నెలల్లోనే ఈ కొత్త జీవితానికి అలవాటు పడిపోయామని, ఈ క్రమంలోనే తమ బంధం మరింత బలపడిందని ఆనందం వ్యక్తం చేసింది.

చిన్నతనం నుంచి నా పెళ్లిపై ఎన్నో కలలు, ఆశలు ఉండేవి. చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకోవాలనుకునేదాన్ని. నిజానికి మన రాష్ట్రం అబ్బాయిని కాకుండా వేరే రాష్ట్రం అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని భావించేదాన్ని. అంతెందుకు.. ఓ హీరోని పెళ్లి చేసుకుంటానని జీవితంలో అస్సలు ఊహించలేదు. కానీ నా అదృష్టం కొద్దీ చైతు నా లైఫ్‌లోకి వచ్చాడు అంటూ శోభిత మురిసిపోయింది.

ప్రస్తుతం శోభిత చేసిన ఈ కామెంట్స్ అక్కినేని అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను, పర్సనల్ లైఫ్‌ను పర్‌ఫెక్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ ఈ జంట నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story