Sitare Zameen Par: ఓటీటీలోకి అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

Sitare Zameen Par: అమీర్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ 'సితారే జమీన్ పర్' ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్‌లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. పూర్తి వివరాలు, ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఈ స్టోరీలో చదవండి.

Ganesh
Published on: 25 March 2026 2:55 PM IST
Sitare Zameen Par
X

Sitare Zameen Par: ఓటీటీలోకి అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ 'సితారే జమీన్ పర్' డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేందుకు ముహూర్తం ఖరారైంది. థియేటర్లలో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ ఈ సినిమా స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. వచ్చే నెలలో రానున్న గుడ్ ఫ్రైడే సుదీర్ఘ వారాంతాన్ని పురస్కరించుకుని, ఏప్రిల్ 3వ తేదీ నుంచి 'సితారే జమీన్ పర్' సోనీ లివ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని సోనీ లివ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

ట్విస్ట్‌లు దాటుకుంటూ ఓటీటీకి..

నిజానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయబోనని, నేరుగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తెస్తానని గతంలో అమీర్ ఖాన్ ప్రకటించారు. అన్నట్లుగానే, గతేడాది జూన్ 20న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రాన్ని ఆగస్టు 1న యూట్యూబ్‌లో రూ.100 అద్దె (Rent) ప్రాతిపదికన అందుబాటులో ఉంచారు. అయితే, ఇప్పుడు భారీ డీల్‌తో సోనీ లివ్ ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఆర్.ఎస్. ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అమీర్ ఖాన్‌కు జోడీగా జెనీలియా దేశ్‌ముఖ్ నటించారు.

కథ:

మద్యం తాగి వాహనం నడిపినందుకు శిక్షగా, కోర్టు ఆదేశాల మేరకు ఒక బాస్కెట్‌బాల్ కోచ్.. ప్రత్యేక అవసరాలు గల (Special needs) పిల్లల బృందానికి శిక్షణ ఇవ్వాల్సి వస్తుంది. ఆ క్రమంలో వారి మధ్య ఏర్పడే బంధం, భావోద్వేగాల సమాహారమే ఈ సినిమా. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.265 కోట్లకు పైగా వసూలు చేసి అమీర్ ఖాన్ కెరీర్‌లో హిట్‌గా నిలిచింది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఏప్రిల్ 3 నుంచి తమ ఇంట్లోనే వీక్షించవచ్చు.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story