Euphoria OTT: యుఫోరియా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే..!

సారా అర్జున్ నటించిన ‘యుఫోరియా’ చిత్రం ఏప్రిల్ 2 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది

Ganesh
Published on: 30 March 2026 5:12 PM IST
Euphoria OTT
X

Euphoria OTT: యుఫోరియా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే..! 

Euphoria OTT: ఇటీవల Dhurandhar, Dhurandhar: The Revenge సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న సారా అర్జున్ నటించిన మరో చిత్రం యుఫోరియా ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలై, కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, కథ విషయంలో మంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాదు, గద్దర్ అవార్డ్స్ లో రెండు అవార్డులు సాధించడం ఈ సినిమాకు మరో ప్లస్‌గా మారింది. భూమిక చావ్లాకు ఉత్తమ సహాయ నటిగా, గుణశేఖర్‌కు ఉత్తమ కథా రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఏప్రిల్ 2 నుంచి ETV Winలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది . ఈ సినిమాలో చైత్రగా కనిపించిన సారా అర్జున్ తన పాత్రకు న్యాయం చేసింది. ఆమెతో పాటు విఘ్నేశ్ గవిరెడ్డి, గౌతమ్ వాసుదేవ్ మేనన్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాల భైరవ అందించిన సంగీతం కథ మూడ్‌కు బాగా సెట్ అయింది.

కథ పరంగా చూస్తే, ఇది ఒక సాధారణ అమ్మాయి జీవితంలో జరిగిన ఒక్క సంఘటన ఎలా భారీ మార్పు తీసుకువస్తుందో చూపించే ప్రయత్నం. ఐఏఎస్ అవ్వాలని కలలు కనే చైత్ర, ఒక రోజు స్నేహితులతో వెళ్లిన పార్టీ తర్వాత అనుకోని పరిస్థితుల్లో చిక్కుకుంటుంది. ఆ తర్వాత జరిగిన ఘటన ఆమె జీవితాన్నే మార్చేస్తుంది. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా ఆమె ఎలా నిలబడింది? వ్యవస్థలోని ఒత్తిళ్ల మధ్య న్యాయం సాధ్యమైందా? అనే ప్రశ్నల చుట్టూ సినిమా సాగుతుంది. ఎమోషన్, రియాలిటీ కలగలిపిన ఈ కథ ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Ganesh

Ganesh

2022లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 4 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. లైఫ్ స్టైల్, బిజినెస్‌, మూవీస్, స్పోర్ట్స్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా సినిమా గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story