రిలేషన్ షిప్‌పై సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: నటి , నిర్మాత సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు.
రిలేషన్ షిప్‌పై సమంత షాకింగ్ కామెంట్స్!
Samantha: నటి , నిర్మాత సమంత ప్రస్తుతం తన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో, ఆమె భర్త, ప్రముఖ నిర్మాత రాజ్ నిడిమోరు నిర్మాణంలో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా సమంత చేసిన ఒక రిలేషన్ షిప్ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
ఏమన్నారంటే?
ఈ ప్రమోషన్లలో రాజ్ నిడిమోరు కూడా పక్కనే ఉండగా, సమంత వ్యక్తిగత ఎదుగుదల గురించి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "కెరీర్ , రిలేషన్ షిప్ మన చేతుల్లోనే ఉంటాయి. కానీ కొన్నిసార్లు బంధాలు క్లిష్టంగా మారవచ్చు. ఒక బంధం నిలబడాలంటే ఇద్దరు వ్యక్తులు కృషి చేయాలి. అందుకే మహిళగా మీపై మీకు నమ్మకం ఉండాలి, మీరు మీలో పరిపూర్ణంగా ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.
అలాగే, "మరొక వ్యక్తి వచ్చి మిమ్మల్ని పూర్తి చేస్తారని ఆశించవద్దు. అలా ఆశిస్తే ఎదుటి వ్యక్తిపై అంచనాలు పెరిగి బంధం దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి, ఎవరికి వారు ముందుగా తమను తాము పూర్తి చేసుకున్న తర్వాతే రిలేషన్ షిప్‌లోకి అడుగుపెట్టాలి" అని సమంత సూచించారు.
సోషల్ మీడియాలో వైరల్..
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు వెంటనే దీనిని శోభిత ధూళిపాళ గతంలో చేసిన కామెంట్లతో పోల్చడం మొదలుపెట్టారు. తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా శోభిత ఒక ప్రత్యేక వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
అందులో తన భర్త నాగ చైతన్యతో పరిచయం, ఆయన వ్యక్తిత్వంపై ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. తనకు నచ్చిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావడం తన అదృష్టమని పేర్కొన్న శోభిత, ఒక వ్యక్తి జీవితంలోకి వచ్చాకే మనం పరిపూర్ణులమవుతామో లేదో తెలియదు కానీ, తను లేని తన జీవితం అసంపూర్ణమేనని ఆయనపై తన ప్రేమను చాటుకున్నారు.
దీంతో నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సమంత పరోక్షంగా శోభిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారని భావిస్తుంటే, మరికొందరు మాత్రం అది కేవలం సమంత తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే పంచుకున్నారని, అందులో ఎలాంటి కౌంటర్ లేదని వాదిస్తున్నారు.
కెరీర్ అప్‌డేట్స్
ఇటీవలే తాను గర్భవతినని ప్రకటించిన సమంత, ప్రసవం వరకు సినిమాలకు చిన్నపాటి విరామం తీసుకోనున్నట్లు వెల్లడించారు. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌లను ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. మరోవైపు, శోభిత ధూళిపాళ పా రంజిత్ దర్శకత్వంలో వస్తున్న 'వెట్టువం' చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో వి.ఆర్. దినేష్ , ఆర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.




