Samantha: అఖిల్ సినిమాపై సమంత షాకింగ్ పోస్ట్!
Samantha: అక్కినేని అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది.
Samantha: అఖిల్ సినిమాపై సమంత షాకింగ్ పోస్ట్!
Akhil Akkineni: అక్కినేని యువ హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత థియేటర్లలోకి అడుగుపెట్టి.. బాక్సాఫీస్ వద్ద గట్టి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా జూలై 10న విడుదలైన యాక్షన్ డ్రామా ‘లెనిన్’ మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది.
ఈ చిత్రంలో అఖిల్ పడిన కష్టం, మేకోవర్ స్క్రీన్‌పై అడుగడుగునా కనిపిస్తోంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో అఖిల్ ఇంటెన్స్ మాస్ లుక్, రగ్గడ్ అవతార్, డైలాగ్ డెలివరీకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇప్పటివరకు టాలీవుడ్‌లో మాస్ అంటే జూనియర్ ఎన్టీఆర్ గుర్తొచ్చేవారని, కానీ ‘లెనిన్’తో ఆ ఊరమాస్ లిస్ట్‌లో అఖిల్ కూడా చేరిపోయాడంటూ అక్కినేని ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.
ఒకవైపు ‘లెనిన్’ థియేటర్లలో రచ్చ లేపుతుంటే.. మరోవైపు ఈ సినిమా సక్సెస్‌పై టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ‘లెనిన్’ అఫీషియల్ ట్రైలర్‌ను షేర్ చేస్తూ అఖిల్‌కు, చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది.అక్కినేని అఖిల్‌తో పాటు ‘లెనిన్’ టీమ్ మొత్తానికి ఆల్ ది వెరీ బెస్ట్.. ఈ సినిమాకు ఇప్పటికే బిగ్ బ్లాక్‌బస్టర్ వైబ్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ అందరికీ గొప్ప విజయం దక్కాలి అని సమంత పోస్ట్ పెట్టింది.
నాగచైతన్యతో విడిపోయిన తర్వాత అక్కినేని కుటుంబానికి సమంత దూరంగా ఉంటున్నప్పటికీ.. తమ్ముడు అఖిల్ పట్ల ఆమె చూపించిన ఈ ప్రత్యేక అభిమానం నెటిజన్ల మనసులను గెలుచుకుంటోంది. వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నా.. అఖిల్, సమంత మధ్య ఉన్న ప్యూర్ ఫ్రెండ్‌షిప్ బాండ్ మాత్రం అలాగే ఉంది అంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు, కేవలం సమంత మాత్రమే కాదు.. ఇటీవల సమంత నిర్మించి, నటించిన ‘మా ఇంటి బంగారం’ సినిమా ప్రమోషన్స్ సమయంలో అఖిల్ కూడా ఆ చిత్రంపై, సమంత నటనపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇప్పుడు అఖిల్ కెరీర్‌లోనే మైల్‌స్టోన్‌గా నిలిచే ‘లెనిన్’ చిత్రానికి సమంత సపోర్ట్‌గా నిలవడం నిజంగా విశేషం. ఏదేమైనా అటు థియేటర్లలో అఖిల్ మాస్ ఊచకోత, ఇటు సోషల్ మీడియాలో సమంత స్పెషల్ విషెస్‌తో అక్కినేని అభిమానులకు పండగే పండగ.




