‘మా ఇంటి బంగారం’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

సమంత బ్లాక్‌బస్టర్ హిట్ ‘మా ఇంటి బంగారం’ వెనుక ఉన్న ఆసక్తికరమైన సీక్రెట్ బయటపడింది.

Naresh.k
Updated on: 21 Jun 2026 11:16 AM IST
Maa Inti Bangaram
X

‘మా ఇంటి బంగారం’ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా..?

Maa Inti Bangaram: స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత వెండితెరపైకి రీ-ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19 థియేటర్లలో విడుదలై, మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ సినిమా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 13 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ డ్రామాలో శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, గౌతమి, వెన్నెల కిశోర్ వంటి భారీ తారాగణం ఉన్నప్పటికీ.. థియేటర్లలో మాత్రం సమంత వన్-మెన్ షో నడుస్తోంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా సామ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి. పర్సనల్ లైఫ్‌లో విడాకులు, ఆరోగ్యం పరంగా మయోసైటిస్ వంటి ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్న సమంతకు ఇది ‘గ్రేట్ కమ్ బ్యాక్ మూవీ’ అని సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు.

అయితే, ఈ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కథలో హీరోయిన్‌గా మొదట సమంతను అనుకోలేదట. న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవిని ఈ మూవీలో మెయిన్ లీడ్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారట. సినిమా రిలీజ్‌కు ముందు జరిగిన ప్రమోషన్లలో సమంత స్వయంగా ఈ క్రేజీ సీక్రెట్‌ను బయటపెట్టింది.

సమంత మాట్లాడుతూ.. నేను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ బ్యానర్ ప్రారంభించినప్పుడు, లేడీ ఓరియంటెడ్ , కంటెంట్ ఉన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. అందులో భాగంగానే ‘మా ఇంటి బంగారం’ కథ సిద్ధమైనప్పుడు మొదట సాయిపల్లవికి చెప్పాలనుకున్నాం. ఎలాగైనా ఆమెతోనే ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశాం. పైగా సాయి పల్లవి నటనకు నేను పెద్ద అభిమానిని. నా బ్యానర్‌లో ఆమె నటిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. కానీ, ఆ సమయంలో సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ కుదరలేదు అని చెప్పుకొచ్చింది.

సాయిపల్లవి డేట్స్ దొరక్కపోవడంతో సమంత అండ్ టీమ్ పునరాలోచనలో పడ్డారట. ఇంత మంచి కథను పక్కన పెట్టడం ఇష్టం లేక, ఆ స్క్రిప్ట్‌ను సమంత బాడీ లాంగ్వేజ్‌కు, ఇమేజ్‌కు సరిపోయేలా మార్పులు చేశారు. సాయిపల్లవి వెర్షన్‌లో లేని కొన్ని భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌ను సమంత కోసం ప్రత్యేకంగా జోడించి నందిని రెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. అలా సాయిపల్లవి చేయాల్సిన ప్రాజెక్ట్ కాస్తా సమంత చేతుల్లోకి వచ్చి, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ‘బంగారం’ లాంటి కలెక్షన్లు కురిపిస్తోంది.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంతతో పాటు ప్రముఖ మేకర్స్ రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించగా.. సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. మొత్తానికి సాయిపల్లవి మిస్ చేసుకున్న ఈ కథ, సమంత కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్స్‌గా నిలిచిపోవడం విశేషం.





Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story