Tollywood: రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తగ్గించిన స్టార్ హీరో! కొత్త సినిమా విశేషాలు ఇవిగో
Tollywood: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన కొత్త సినిమా కోసం రెమ్యునరేషన్‌లో భారీ కోత విధించినట్లు సమాచారం. దిల్ రాజు బ్యానర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విశేషాలు ఇక్కడ చూడండి.
Tollywood: రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తగ్గించిన స్టార్ హీరో! కొత్త సినిమా విశేషాలు ఇవిగో
Tollywood: భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పారితోషికాల గురించి ఎప్పుడూ భారీ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన రెమ్యునరేషన్‌కు సంబంధించి తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
సాధారణంగా సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు రూ.120 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటుంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అయితే ప్రముఖ నిర్మాత దిల్ రాజు బానర్‌లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'SVC63' చిత్రం కోసం ఆయన కేవలం రూ.70 కోట్లు మాత్రమే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆయన తన రెమ్యునరేషన్‌లో ఏకంగా రూ.50 కోట్లు తగ్గించుకున్నట్లు సమాచారం.
ఈ భారీ డీల్ వెనుక బాలీవుడ్‌కు చెందిన మరో ప్రొడ్యూసర్ రషి కాజీ కీలక పాత్ర పోషించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహం, ప్రాజెక్ట్ ప్రాధాన్యత దృష్ట్యా సల్మాన్ ఖాన్ ఈ పారితోషికం మార్పునకు అంగీకరించినట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.
కాగా, ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను 2027 రంజాన్ (ఈద్) కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నూతన సంవత్సరంలో రానున్న ఈ పండుగ సీజన్‌ను టార్గెట్ చేస్తూ మేకర్స్ షూటింగ్ షెడ్యూళ్లను వేగవంతం చేశారు. సల్మాన్ ఖాన్ సరసన రష్మిక ఈ సినిమాలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ చిత్ర యూనిట్ నుంచి రాలేదు.




