Toxic: యశ్ 'టాక్సిక్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' వచ్చేసింది.
Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్క్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' .
Toxic: యశ్ 'టాక్సిక్' నుంచి రొమాంటిక్ మెలోడీ 'మనసాగదే' వచ్చేసింది.
Toxic: కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్క్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' . ఇప్పటికే విడుదలైన 'తబాహీ' పాట బాక్సాఫీస్ వద్ద చార్ట్‌బస్టర్‌గా నిలవగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి రెండో సింగిల్ 'మనసాగదే' పాటను విడుదల చేశారు. రొమాంటిక్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో సాగే ఈ గీతం అన్ని ప్రధాన భాషల్లో శ్రోతలను అలరిస్తోంది.
పాట ప్రత్యేకతలు … సంగీతం
'తబాహీ' మాస్ అండ్ హై-ఎనర్జీ సాంగ్ అయితే, 'మనసాగదే' పూర్తిగా ప్రేమ, భావోద్వేగాలతో కూడిన మెలోడీ ట్రాక్. ఈ పాటకు తనిష్క్ బాగ్చి, అర్సలాన్ నిజామి , ఫహీమ్ అబ్దుల్లా సంగీతం అందించగా, తెలుగు వెర్షన్‌కు ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యాన్ని అందించారు. సిద్దార్థ్ బస్రూర్ తన ఆలాపనతో పాటను మరింత అందంగా మలిచారు.
యశ్, తారా సుతారియా ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ
ఈ రొమాంటిక్ సాంగ్‌లో యశ్ , తారా సుతారియా జంట మధ్య ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. వీరితో పాటు ఈ పాట వీడియోలో కియారా అద్వానీ , నయనతార కూడా ప్రత్యేకంగా కనిపించి సర్ప్రైజ్ చేశారు. మొదటి వినడానికి సామాన్యంగా అనిపించినా, ఈ మ్యూజికల్ మెలోడీ రిపీటెడ్ వినడంలో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.
విడుదల తేదీ … నిర్మాణం
కెవిఎన్ ప్రొడక్షన్స్ , మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న 'టాక్సిక్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26, 2026 న భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కానుంది.




