RAW NTR: ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..నాలుగు రోజుల్లోనే అంతా అయిపోయింది.

RAW NTR: కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న 'RAW ఎన్టీఆర్' టీమ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Naresh.k
Published on: 23 July 2026 10:21 AM IST
RAW NTR
X

RAW NTR: ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..నాలుగు రోజుల్లోనే అంతా అయిపోయింది.

RAW NTR: కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న RAW ఎన్టీఆర్ టీమ్ షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేసింది. ప్రెస్ మీట్ నిర్వహించిన కేవలం నాలుగు రోజుల్లోనే తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో ఈ వ్యవహారం టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ గత కొన్ని రోజులుగా ఊపేస్తున్న పేరు RAW ఎన్టీఆర్ . ఎక్కడ చూసినా ఈ సంస్థ గురించిన చర్చలే నడిచాయి. అయితే, అందరినీ ఆశ్చర్యపరిచేలా ఈ టీమ్ తాజాగా ఒక షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది. ఇకపై తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రత్యామ్నాయ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది.

తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ..మా సేవలను ఇక్కడితో నిలిపివేస్తున్నాం.. ఇందులో విజయం సాధించిన ప్రతి ఒక్కరికీ మా హృదయపూర్వక అభినందనలు అంటూ రాసుకొచ్చారు. అయితే, ఎందుకు సేవలు ఆపేస్తున్నారనే దానికి స్పష్టమైన కారణాలను మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇటీవలే ఈ సంస్థ నుంచి 'ఊరు వాడా' అనే కొత్త పోస్టర్ అధికారికంగా విడుదల కావడంతో RAW ఎన్టీఆర్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ పోస్టర్ వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి.

ఈ విమర్శలు, వివాదాల నేపథ్యంలో కేవలం నాలుగు రోజుల క్రితమే RAW ఎన్టీఆర్ నిర్వాహకులు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో వారు మాట్లాడుతూ.. తమకు ఎన్టీఆర్ అంటే ప్రాణమని, ఆయన కీర్తి ప్రతిష్టలకు ఎలాంటి భంగం వాటిల్లే పని తాము ఎప్పటికీ చేయబోమని స్పష్టం చేశారు.తాము ఎప్పుడు ఎన్టీఆర్‌ను కలవాలని ప్రయత్నించినా, ఆయన చుట్టూ ఉన్న కోటరీ తమ ప్రయత్నాలను పదే పదే భగ్నం చేస్తోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమను తారక్‌కు దూరం చేయడానికి కొందరు కావాలనే కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.

అంతలా ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే RAW ఎన్టీఆర్ టీమ్ తమ సేవలకు పూర్తిస్థాయిలో స్వస్తి పలకడం గమనార్హం. ఇందులో విజయం సాధించిన వాళ్లకు అభినందనలు అని పేర్కొనడాన్ని బట్టి, తమను అడ్డుకున్న వారిపై పరోక్షంగా సెటైర్ వేస్తూనే తప్పుకున్నారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏది ఏమైనా, కొద్దిరోజుల పాటు నెట్టింట హల్‌చల్ చేసిన RAW ఎన్టీఆర్ అధ్యాయం ఈ ప్రకటనతో ముగిసిందనే చెప్పాలి.


Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story