Irumudi: దేవుడి కథ కాదు.. మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్..!

Irumudi: మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' థియేట్రికల్ ట్రైలర్ భీమవరంలో గ్రాండ్‌గా విడుదల చేశారు.

Naresh.k
Published on: 13 Aug 2026 12:24 PM IST
Irumudi
X

Irumudi: దేవుడి కథ కాదు.. మైండ్ బ్లోయింగ్ క్రైమ్ థ్రిల్లర్..!

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా భీమవరంలో నిర్వహించిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్లు, టీజర్లలో రవితేజను అయ్యప్ప స్వామి మాల ధరించిన ఆధ్యాత్మిక అవతార్‌లోనే చూపిస్తూ వచ్చారు. దాంతో అందరూ ఇదొక ఆధ్యాత్మిక లేదా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని భావించారు. కానీ, తాజాగా విడుదలైన ట్రైలర్ చూసాక ప్రేక్షకులు తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్నారు.

శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్‌ను పక్కాగా బ్యాలెన్స్ చేస్తూనే, కథలో ఊహించని క్రైమ్ థ్రిల్లర్ కోణాన్ని ట్రైలర్‌లో రివీల్ చేశారు. రవితేజ క్యారెక్టరైజేషన్, ఆయన నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం దేవుడి కథ మాత్రమే కాదు.. సీటు అంచున కూర్చోబెట్టే ఒక సస్పెన్స్ అండ్ క్రైమ్ ఎలిమెంట్ ఈ 'ఇరుముడి' కథలో ఉందని ట్రైలర్ కట్ స్పష్టం చేస్తోంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియ భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బేబీ నక్షత్ర అత్యంత కీలకమైన పాత్రలో అలరించనుంది. యువ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ స్వరపరిచిన సంగీతం సినిమాకు బ్యాక్‌బోన్‌గా నిలవగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైన్ విజువల్స్‌ను మరింత గ్రాండ్‌గా మార్చాయి. మాస్, ఎమోషన్, థ్రిల్ మేళవించిన ఈ 'ఇరుముడి' ఆగస్టు 21న బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story