Irumudi: బాక్సాఫీస్ వద్ద రవితేజ విశ్వరూపం..చిరంజీవి సినిమా రికార్డ్‌ బద్దలు!

Irumudi: మాస్ మహారాజా రవితేజ 'ఇరుముడి' చిత్రం బుక్ మై షోలో గంటకు 32.25K టికెట్ల అమ్మకాలతో ఆల్-టైమ్ రికార్డు సృష్టించి, మెగాస్టార్ చిరంజీవి రికార్డును అధిగమించింది

Gagan kumar
Published on: 22 Aug 2026 10:32 AM IST
Irumudi
X

Irumudi: బాక్సాఫీస్ వద్ద రవితేజ విశ్వరూపం..చిరంజీవి సినిమా రికార్డ్‌ బద్దలు!

Irumudi: మస్ మహారాజా రవితేజ, క్లాస్ అండ్ ఎమోషనల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదలై, మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్‌ను సొంతం చేసుకుంది.

యుఎస్ ప్రీమియర్స్ నుంచే ఊపేసిన పాజిటివ్ వైబ్స్, తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో మార్నింగ్ షోలకే హౌస్‌ఫుల్ బోర్డులు పడేలా చేశాయి. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఊహించని రెస్పాన్స్ చూసి డిస్ట్రిబ్యూటర్లు ఈవెనింగ్ షోల సంఖ్యను పెంచారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా ఉన్న ప్రతి సెంటర్‌లోనూ థియేటర్లను మరింత పెంచాలనే డిమాండ్ ఊపందుకుంది. సెకండ్ షోలన్నీ ఇప్పటికే ఫుల్ అవ్వగా, మరుసటి రోజు బుకింగ్స్ కూడా ఊహించని రేంజ్‌లో జరుగుతున్నాయి. మౌత్ టాక్ విపరీతంగా స్ప్రెడ్ అవ్వడంతో తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా భారీ వసూళ్లను రాబట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

డిజిటల్ యుగంలో ఒక సినిమా విజయాన్ని ఆన్‌లైన్ టికెట్ సేల్స్ బట్టి అంచనా వేయడం సర్వసాధారణంగా మారింది. ఈ విభాగంలో రవితేజ తన కెరీర్‌లోనే కాకుండా, రీజనల్ సినిమాల చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. 'ఇరుముడి' మూవీ బుక్ మై షోలో గంటకు అత్యధిక టికెట్లు అమ్ముడైన చిత్రంగా ఆల్-టైమ్ రికార్డ్ నమోదు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

బుక్ మై షో ట్రెండ్స్ ప్రకారం గంటకు ఏకంగా 32.25K టికెట్లు అమ్ముడవుతున్నాయి. సంక్రాంతికి వచ్చిన చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' పేరిట ఉన్న గంటకు 31.6K టికెట్ల రికార్డును 'ఇరుముడి' అధిగమించింది. ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రావడం ప్రాంతీయ సినిమాల్లో అరుదైన విషయమని, మొదటి రోజు కలెక్షన్లు టాలీవుడ్‌ను రీసౌండ్ చేస్తాయని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story