జపాన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక!
Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటారు.
జపాన్ వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండ రష్మిక!
Rashmika Mandanna: టాలీవుడ్ మోస్ట్ క్యూట్ అండ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత కూడా సోషల్ మీడియాలో నిరంతరం ట్రెండింగ్‌లో ఉంటారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న ఈ జంట, ప్రస్తుతం లైఫ్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. తాజాగా టోక్యోలో జరిగిన ‘యానిమే అవార్డ్స్’ హాజరైన రష్మిక.. ఆ తర్వాత తన భర్త విజయ్‌తో కలిసి జపాన్ వీధుల్లో లవ్లీ మూమెంట్స్‌ను గడిపింది. దీనికి సంబంధించిన క్యూట్ ఫోటోలు, వీడియోలను రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అవి కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.
జపాన్ ట్రిప్ ఎక్స్ట్రా ఫన్.. సాంప్రదాయ దుస్తుల్లో నేషనల్ క్రష్!
"ఈ ఏడాది జపాన్ ట్రిప్ ఎక్స్ట్రా ఫన్‌గా సాగింది" అంటూ రష్మిక కొన్ని ఫోటోలను పంచుకుంది. ఇందులో ఆమె జపనీస్ సాంప్రదాయ దుస్తులైన ‘యుకాటా’ (లైట్వైట్ కిమోనో) ధరించి మెరిసిపోయింది. ఆరెంజ్, ఎల్లో కలర్ సన్‌ఫ్లవర్ డిజైన్ ఉన్న ఈ డ్రెస్‌లో రష్మిక ఎంతో క్యూట్‌గా కనిపించింది. జపాన్ లోకల్ ఫుడ్‌ను టేస్ట్ చేస్తూ, అక్కడి వీధుల్లో సరదాగా తిరుగుతూ దిగిన ఫోటోలతో పాటు.. తన భర్త విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని బ్లర్రి పిక్స్‌ను కూడా ఈ పోస్ట్‌లో జత చేసి ఫ్యాన్స్‌కు స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది.
విజయ్ మెడలో ‘R’ అక్షరం చైన్.. నెటిజన్స్ డీకోడింగ్!
ఇదిలా ఉంటే, ఇటీవల వీరిద్దరూ ఎయిర్‌పోర్టులో కనిపించిన ఒక వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఎయిర్పోర్ట్ నుండి బయటకు వస్తున్న సమయంలో విజయ్ దేవరకొండ మెడలో ఉన్న గోల్డ్ చైన్‌ను నెటిజన్లు గమనించారు. ఆ చైన్ లాకెట్లో ‘R’ (రష్మిక) అనే అక్షరం స్పష్టంగా కనిపిస్తుండటంతో.. భార్యపై విజయ్‌కు ఉన్న ప్రేమ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ సినిమాలతో లవ్ జర్నీ స్టార్ట్ చేసిన ఈ ఇద్దరూ.. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒకటయ్యాక చూపిస్తున్న బాండింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది.
పెళ్లి తర్వాత ‘రణబలి’తో రాబోతున్న క్రేజీ కపుల్
ఆన్-స్క్రీన్ , ఆఫ్-స్క్రీన్ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకున్న విజయ్-రష్మిక.. పెళ్లి తర్వాత మొదటిసారిగా కలిసి నటిస్తున్న భారీ చిత్రం “రణబలి”. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో (1854 - 1878) తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇక విజయ్ తన తదుపరి చిత్రం ‘VDxShouryuv’ షూటింగ్‌తో బిజీగా ఉండగా.. రష్మిక ‘కాక్టెయిల్ 2’, ‘మైసా’ వంటి చిత్రాలతో బాలీవుడ్, టాలీవుడ్‌లలో దూసుకుపోతోంది.




