Rashmika: పెళ్లైన నెలరోజులకే రష్మిక ఎమోషనల్ పోస్ట్

Rashmika:విజయ్ దేవరకొండ - రష్మిక మందన్నల రాయల్ వెడ్డింగ్ జరిగి నెల రోజులు పూర్తయింది.

Naresh.k
Published on: 27 March 2026 11:25 AM IST
Rashmika
X

Rashmika: పెళ్లైన నెలరోజులకే రష్మిక ఎమోషనల్ పోస్ట్

Vijay Deverakonda - Rashmika Mandanna : టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న పెళ్లి పీటలెక్కి అప్పుడే నెల రోజులు గడిచిపోయిందా? అవుననే అంటోంది నేషనల్ క్రష్ రష్మిక. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 26న జరిగిన వీరిద్దరి 'రాయల్ వెడ్డింగ్' జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ రష్మిక షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. సినిమా వెండితెరపై 'గీత గోవిందం'గా అలరించిన ఈ జంట, నిజ జీవితంలోనూ ఒక్కటవ్వాలని కోరుకున్న కోట్లాది మంది అభిమానుల కల ఫిబ్రవరి 26న నిజమైంది. ఉదయ్‌పూర్ కోట సాక్షిగా జరిగిన ఈ వేడుక ముగిసి అప్పుడే నెల రోజులు పూర్తయిన సందర్భంగా, రష్మిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి అన్‌సీన్ ఫొటోలను షేర్ చేస్తూ ఒక సుదీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది.

నమ్మలేకపోతున్నాను..

"పెళ్లి జరిగి అప్పుడే నెల రోజులు గడిచిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. పెళ్లి అనేది నాకు ఎప్పుడూ ఒక అందమైన కలలా అనిపించేది. కానీ ఇప్పుడు విజయ్‌తో కలిసి ఆ కలను నిజం చేసుకుని ఒక నెల పూర్తి చేసుకున్నాం" అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది రష్మిక. ఈ ప్రయాణంలో తనకు తోడుగా నిలిచిన తన ఆత్మీయులను 'రక్షక దేవతలు' అని సంబోధిస్తూ కృతజ్ఞతలు తెలిపింది.

ఎమోషనల్ పోస్ట్..

ముఖ్యంగా తన ప్రాణ స్నేహితురాలు ఐశ్య గురించి చెబుతూ రష్మిక భావోద్వేగానికి లోనైంది. "ఐశ్య.. నువ్వు నాకు ఎన్నో ఏళ్లుగా కొండంత అండగా నిలిచావు. బయట ఎవరికీ చెప్పుకోలేని నా మనసులోని బాధను, సంఘర్షణను నువ్వు మాత్రమే అర్థం చేసుకునేదానివి. నేను కుంగిపోయిన ప్రతిసారీ నా పక్కనే ఉండి ధైర్యం చెప్పావు. ఈ పెళ్లి ఇంత అద్భుతంగా జరగడానికి అసలు కారణం నువ్వే" అంటూ తన స్నేహానికి నీరాజనాలు పట్టింది.

'వెరైటీ' పెళ్లి

విజయ్-రష్మికల పెళ్లి ప్లానింగ్ గురించి వివరిస్తూ.. ఈవెంట్ ఆర్గనైజర్స్ ప్రియ మాగంటి, అర్పితలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది. "మా ఆలోచనలు కొంచెం వెరైటీగా, పాత పద్ధతులకు భిన్నంగా ఉండాలని కోరుకున్నాం. మేము చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని మీరు కాదనకుండా అర్థం చేసుకుని ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. మా కుటుంబ సభ్యులందరికీ మీ పనితనం చాలా బాగా నచ్చింది" అని ప్రశంసించింది. "ప్రతి విషయాన్ని మేమే చూసుకుంటాం, మీరు మాత్రం ప్రశాంతంగా ఈ రోజులను ఎంజాయ్ చేయండి అని చెప్పిన మీ అందరి వల్లే నేను ప్రశాంతంగా ఉండగలిగాను. మీరే నా చిన్న ప్రపంచం" అంటూ రష్మిక రాసుకొచ్చిన మాటలు నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

వైరల్ అవుతున్న ఫొటోలు

రష్మిక పోస్ట్ చేసిన ఫొటోల్లో విజయ్ దేవరకొండ - రష్మికల కెమిస్ట్రీ చూసి అభిమానులు మురిసిపోతున్నారు. "మేడ్ ఫర్ ఈచ్ అదర్" అంటూ నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నింపేస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Naresh.k

Naresh.k

Next Story