Ramayana Part 1 Trailer : 5 భాషల్లో భారీ విజువల్స్‌తో అదరగొడుతున్న 'రామాయణ: పార్ట్ 1' ట్రైలర్..!
Ramayana Part 1 Trailer : ఎన్నో వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు, సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. భారతీయ సినిమా
Ramayan Trailer
Ramayana Part 1 Trailer : ఎన్నో వారాలుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు, సినీ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'రామాయణ: పార్ట్ 1' మూవీ ట్రైలర్‌ను జూలై 30 తెల్లవారుజామున మేకర్స్ విడుదల చేశారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఒకేసారి వచ్చిన ఈ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ రెండు భాగాల సిరీస్, మన పవిత్ర ఇతిహాసం ఆధారంగా రూపుదిద్దుకుంటోంది. గ్రాండ్ విజువల్స్, భారీ సెట్లు, అంతర్జాతీయ స్థాయి వీఎఫ్ఎక్స్ (VFX) గ్రాఫిక్స్‌తో ట్రైలర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.
దేవలోకంపై రావణుడి కన్ను.. రాముడి అరణ్యవాసం..
ట్రైలర్ ప్రారంభంలోనే రావణాసురుడు దేవలోకాన్నిఆక్రమించి పాలించాలని చూసే సన్నివేశాలతో ఉత్కంఠ పెంచారు. అందుకు సంబంధించిన విజువల్స్, ఇంద్రుడు వాహనం ఐరావతంతో ఫైటింగ్ సీన్ చూపిస్తూ ట్రైలర్ కట్ చేశారు. ఆ తర్వాత ధైర్యసాహసాలు, దయాగుణం ఉన్న రాజకుమారుడిగా శ్రీరాముడి పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపించారు. రాముడి భార్య సీతాదేవిగా సాయి పల్లవి, తమ్ముడు లక్ష్మణుడిగా రవి దూబేల లుక్స్ చాలా బాగా కుదిరాయి.
అరణ్యవాసంలో సీతాదేవి, లక్ష్మణుడితో కలిసి ప్రశాంతంగా జీవించాలని రాముడు అనుకున్నప్పటికీ, విధి ఆడిన విచిత్ర నాటకం వారిని ఘోరమైన పరిస్థితులకు నెట్టివేస్తుంది. చివరకు అత్యంత కీలకమైన ఘట్టంలో రావణుడితో అనివార్యమైన యుద్ధానికి దారితీసే పరిస్థితులను ట్రైలర్‌లో చాలా డ్రామాటిక్‌గా చూపించారు.
సూపర్ స్టార్ కాస్టింగ్.. అలనాటి రాముడు.. నేటి దశరథుడు..
ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌కి 'దంగల్' డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో నటించిన నటీనటుల విషయానికి వస్తే ఒక పెద్ద సర్‌ప్రైజ్ ఉంది. 1980ల నాటి పాపులర్ రామాయణ్ సీరియల్‌లో శ్రీరాముడిగా నటించి మెప్పించిన అరుణ్ గోవిల్, ఈ సినిమాలో రాముడి తండ్రి దశరథ మహారాజుగా నటిస్తుండటం మరో బోనస్ పాయింట్. వీరితో పాటు రావణుడి తల్లి కైకేయిగా సీనియర్ నటి శోభన, విశ్వామిత్ర మహర్షిగా అజింక్యా డియో, దేవేంద్రుడిగా కుణాల్ కపూర్, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, విభీషణుడిగా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు. అంతేకాకుండా కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ సినిమాకి వన్ ఆఫ్ ది కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఆస్కార్ లెజెండ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఈ చిత్రానికి అవార్డు విన్నర్ శ్రీధర్ రాఘవన్ కథను అందించగా, హాలీవుడ్ , ఇండియన్ సినిమా దిగ్గజాలు కలిసి పనిచేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ విజేతలు హాన్స్ జిమ్మర్ (Hans Zimmer), మన ఏఆర్ రెహమాన్ కలిసి ఈ సినిమాకి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. సినిమా ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్ 'రామాయణ: పార్ట్ 1' ఈ ఏడాది దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.




