బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ విధ్వంసం.. 3 రోజుల్లోనే నైజాం లో ఊహించని రికార్డ్..
Ram Charan: సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది.
బాక్సాఫీస్ దగ్గర ‘పెద్ది’ విధ్వంసం.. 3 రోజుల్లోనే నైజాం లో ఊహించని రికార్డ్..
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టింది. రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం మూడు రోజులు ముగిసేసరికి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే కలెక్షన్లను రాబట్టింది. ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది.
నిజాం ఏరియాలో రామ్ చరణ్ హవా.. 3 రోజుల షేర్ ఎంతంటే?
పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా 3 రోజుల నిజాం కలెక్షన్ల వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, 'పెద్ది' చిత్రం ఒక్క నైజాం ఏరియాలోనే జీఎస్టీతో కలిపి 34 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేసి సంచలనం సృష్టించింది.
శనివారం కంటే ఆదివారం బుకింగ్స్ అద్భుతంగా ఉండటంతో వీకెండ్ ముగిసేసరికి ఈ నంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. చరణ్ మాస్ ఇమేజ్, బుచ్చిబాబు ఎమోషనల్ టేకింగ్ నైజాం ప్రేక్షకులను థియేటర్లకు పరుగులు పెట్టిస్తోంది.
రూ. 350 కోట్ల భారీ బడ్జెట్.. నయా రికార్డుల వైపు ‘పెద్ది’ ప్రయాణం
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా దాదాపు 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.
ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. లాంగ్ రన్‌లో ఈ 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద మరెన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.




