Ram Charan: రామ్ చరణ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Ram Charan: ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్‌లో మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ వెన్నంటే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు ఆయన కొత్త బాడీగార్డ్ కెవిన్ కుంట.
Ram Charan: రామ్ చరణ్ బాడీగార్డ్ జీతం ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Ram Charan bodyguard: గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 04న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక రేంజ్‌లో జరుగుతున్నాయి. ముంబైలో జరిగిన గ్రాండ్ ట్రైలర్ లాంచ్‌తో మొదలై.. భోపాల్, బెంగళూరు నగరాల్లో నిర్వహించిన ‘పెద్ది’ ఈవెంట్స్ వరకు అన్నీ భారీ ఎత్తున సక్సెస్ అయ్యాయి. రామ్‌చరణ్ క్రేజ్ చూసేందుకు వేలాదిగా అభిమానులు తరలివస్తున్నారు.
అయితే, ఈ ప్రమోషనల్ టూర్స్‌లో రామ్‌చరణ్ లుక్స్‌తో పాటు సోషల్ మీడియాలో మరో అంశం విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఎక్కడ చూసినా చరణ్ పక్కనే ఒక కొండలా నిలబడి, అతనికి రక్షణ కవచంలా నిలుస్తున్న ఒక భారీ కటౌట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చరణ్ వెన్నంటే ఉంటూ.. జనాలను నియంత్రిస్తున్న ఆ బీస్ట్ ఎవరు అని నెటిజన్లు ఆరా తీయగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రామ్‌చరణ్‌కు పర్సనల్ సెక్యూరిటీగా వ్యవహరిస్తున్న ఆ బాడీగార్డ్ పేరు కెవిన్ కుంట. ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్.. సాదాసీదా బాడీగార్డ్ కాదు. అతను ప్రస్తుతం ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్. ఇటలీలో నేషనల్ మిడిల్‌వెయిట్ MMA ఛాంపియన్‌గా నిలిచిన కెవిన్‌కు అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు, గ్లోబల్ వీవీఐపీలకు అత్యున్నత స్థాయి క్లోజ్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ అందించడంలో కెవిన్ దిట్ట. అందుకే, మన గ్లోబల్ స్టార్ కోసం పట్టుబట్టి మరీ ఈ ఇంటర్నేషనల్ ఫైటర్‌ను రంగంలోకి దించారు.
ముంబైలో జరిగిన ‘పెద్ది’ ఈవెంట్‌కు వేలాది మంది జనాలు, అభిమానులు, బాలీవుడ్ మీడియా ప్రతినిధులు ఒకేసారి రామ్‌చరణ్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆ సమయంలో చరణ్‌కు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, తన భారీ కాయంతో జనాలను కెవిన్ నియంత్రించిన విధానం చూసి అందరూ నోరెళ్లబెట్టారు. ఈవెంట్స్ ఫొటోలు, వీడియోలలో రామ్‌చరణ్‌తో పాటు కెవిన్ కూడా హైలైట్‌గా నిలుస్తూ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.
రోజుకు రూ. 2 లక్షల జీతం?
ఇంతటి అంతర్జాతీయ ప్రొఫెషనల్ ఫైటర్‌ను సెక్యూరిటీగా పెట్టుకున్నారంటే.. ఆ రేంజ్‌లోనే ఖర్చు కూడా ఉంటుంది కదా. ఈ ఇంటర్నేషనల్ బాడీగార్డ్ జీతం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ప్రస్తుతం ‘పెద్ది’ ప్రమోషన్స్ కోసం కెవిన్‌కు రోజుకు దాదాపు రూ. 2 లక్షల వరకు పారితోషికం ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. మొత్తానికి జూన్ 04న థియేటర్లలో ‘పెద్ది’ సినిమా క్రియేట్ చేయబోయే విధ్వంసానికి ముందే.. రామ్‌చరణ్ తన ఇంటర్నేషనల్ బాడీగార్డ్‌తో ప్రమోషన్స్ లోనే ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.




