Ram Charan: మెగా ఇంట కృష్ణాష్టమి వేడుకల సందడి.. కవల పిల్లల క్యూట్ ఫొటో షేర్ చేసిన ఉపాసన

Ram Charan: రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులు తమ చిన్నారులతో కలిసి ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు జరుపుకున్నారు.

Arun Chilukuri
Published on: 4 Sept 2026 5:38 PM IST
Ram Charan
X

Ram Charan: మెగా ఇంట కృష్ణాష్టమి వేడుకల సందడి.. కవల పిల్లల క్యూట్ ఫొటో షేర్ చేసిన ఉపాసన

Jagadish Reddy: అగ్ర కథానాయకుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ చిన్నారులతో కలిసి శ్రీకృష్ణాష్టమి వేడుకలను అత్యంత వేడుకగా జరుపుకున్నారు. తమ ముగ్గురు పిల్లలను శ్రీకృష్ణుడు, రాధారాణి రూపాల్లో ముచ్చటగా ముస్తాబు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక ఫొటోను సోషల్ మీడియా వేదికగా ఉపాసన అభిమానులతో పంచుకున్నారు. ‘‘కొణిదెల వారి ఇంట్లోకి చిన్ని కృష్ణుడు అడుగుపెట్టాడు’’ అంటూ ఆమె రాసుకొచ్చారు. తమ కలనెరవేరిందంటూ ఆమె షేర్‌ చేసిన ఈ క్యూట్ ఫొటో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

రామ్‌ చరణ్‌ - ఉపాసన దంపతులకు 2023 జూన్‌ 20న మొదటి సంతానంగా కూతురు క్లీంకార జన్మించగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరికి కవలలు జన్మించారు. తమ అబ్బాయికి శివరామ్, అమ్మాయికి అన్వీరా దేవి అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం రామ్‌ చరణ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story