Priya Prakash Varrier: హీరోయిన్ డ్రెస్‌పై అసభ్యకరమైన కామెంట్ చేసిన రిపోర్టర్

Priya Prakash Varrier: ప్రెస్ మీట్‌లో ప్రియా ప్రకాష్ వారియర్‌కు కాషాయం డ్రెస్ పై ఎదురైన వింత ప్రశ్నకు కూల్‌గా కౌంటర్ ఇచ్చింది.

Naresh.k
Published on: 7 Aug 2026 11:24 AM IST
Priya Prakash Varrier
X

Priya Prakash Varrier: హీరోయిన్ డ్రెస్‌పై అసభ్యకరమైన కామెంట్ చేసిన రిపోర్టర్

Priya Prakash Varrier Reporter Counter: కన్నుగీటి దేశవ్యాప్తంగా కుర్రకారు గుండెల్లో రీసౌండ్ తెప్పించిన మలయాళ ముద్దుగుమ్మ ప్రియా ప్రకాష్ వారియర్ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచారు. 'లవర్స్ డే' చిత్రంతో రాత్రికి రాత్రే నేషనల్ క్రష్‌గా మారిన ఈ బ్యూటీ, ప్రస్తుతం వరుస తమిళ, మలయాళ సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే, తాజాగా ఒక ప్రమోషనల్ ఈవెంట్‌లో ప్రియాకు ఊహించని, అసౌకర్యమైన ప్రశ్న ఎదురైంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది.

ఇటీవల జరిగిన ఒక ఈవెంట్‌కు ప్రియా వారియర్ ఎంతో అందమైన కాషాయ రంగు గౌన్‌లో హాజరయ్యారు. కాగా, అక్కడ జరిగిన ప్రెస్ మీట్‌లో ఓ రిపోర్టర్ ఆమెను చూసి... కాషాయ రంగు డ్రెస్ ఎందుకు వేసుకున్నారు? దీని వెనుక ఏమైనా ప్రత్యేక కారణం ఉందా? లేదా ఇక్కడికి రావడానికి ఈ రంగే వేసుకోవాలని ఏమైనా నిబంధన ఉందా? అంటూ వింతగా ప్రశ్నించారు.

ఈ ఊహించని ప్రశ్నకు ప్రియా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ముఖంలో కొంత అసౌకర్యం కనిపించినప్పటికీ, ఎంతో సమయస్ఫూర్తితో స్పందించారు. అలాంటిదేం లేదు.. నేను అన్ని రకాల రంగుల దుస్తులు ధరిస్తాను. వేదికపై ప్రత్యేకంగా లేదా ఆకర్షణీయంగా కనిపించడానికి రంగుతో ఎలాంటి సంబంధం లేదు కదా అంటూ ఆ రిపోర్టర్‌కు ప్రియా ప్రకాష్ వారియర్ కౌంటర్ ఇచ్చింది. తనదైన శైలిలో కూల్‌గా, గట్టిగా సమాధానమిచ్చి ఆ రిపోర్టర్‌కు ప్రియా చెక్ పెట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో మీడియా తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు:

ఒక నటి ఎలాంటి రంగు దుస్తులు వేసుకోవాలో కూడా మీడియానే నిర్ణయిస్తుందా? కేరళలో కాషాయం బట్టలు వేసుకోవడానికి కూడా వివరణలు ఇచ్చుకోవాలా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఫ్యాషన్, రంగుల విషయంలో కూడా వివాదాలు సృష్టించే ప్రయత్నం చేయడం సరికాదని, ప్రియా సముచితంగా సమాధానం ఇచ్చారని మద్దతు తెలుపుతున్నారు. నటీనటుల సినిమాల కంటే వారి వ్యక్తిగత దుస్తుల రంగులపైనే కొందరు దృష్టి పెడుతున్నారని, ఇలాంటి అర్థం లేని ప్రశ్నలు ఆపేయాలని సోషల్ మీడియా వేదికగా హితవు పలుకుతున్నారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story