Priya Bhavani Shankar: ధనుష్ చాలా రూడ్..దారుణంగా ప్రవర్తించారు..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Priya Bhavani Shankar: ధనుష్‌ను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన ప్రవర్తనను 'పొగరు' అని భావించానని నటి ప్రియా భవానీ శంకర్ షాకింగ్ విషయాలు వెల్లడించింది.
Priya Bhavani Shankar: ధనుష్ చాలా రూడ్..దారుణంగా ప్రవర్తించారు..తెలుగు హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
Priya Bhavani Shankar: న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారంభించి, తన సహజ నటనతో తమిళం, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న భామ ప్రియా భవానీ శంకర్. ఇటీవల మాస్ మహారాజ్ రవితేజ సరసన 'ఇరుముడి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ అందాల నటి, తాజాగా ఓ ఇంటర్వ్యూలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌పై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
తను యాంకర్‌గా ఉన్న రోజుల్లో ధనుష్‌తో జరిగిన ఇంటర్వ్యూను ప్రియ గుర్తుచేసుకున్నారు. నేను యాంకరింగ్‌లో ఉన్న కొత్తలో ధనుష్‌ను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ఆయన చాలా అలసిపోయి, అసలు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు.
ఎప్పుడు ఇక్కడి నుంచి బయటపడతాను అన్నట్లుగా ఆయన మూడ్ ఉంది. అది చూసి నాకు చాలా కోపం వచ్చింది. అబ్బో.. ఈ హీరోకి ఎంత అహంకారం, ఎంత యాటిట్యూడ్ అని మనసులోనే తిట్టుకున్నాను అని వెల్లడించారు.
అయితే, తను నటిగా మారి సినిమా ప్రమోషన్లలో పాల్గొనడం ప్రారంభించాక ధనుష్ పరిస్థితి ఆమెకు అర్థమైంది. సినిమా ప్రమోషన్లలో పదే పదే ఒకే రకమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ఎంత అలసటతో కూడుకున్నదో స్వయంగా అనుభవించాక నాకు జ్ఞానోదయం అయింది.
రోజంతా ప్రమోషన్లలో ఉంటే ఎంత ఒత్తిడి ఉంటుందో తెలిసింది. అప్పుడు ధనుష్ ఎందుకు అలా ప్రవర్తించారో క్లారిటీ వచ్చింది అని చెప్పారు. తర్వాత ధనుష్‌తో కలసి నటించే అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని ఆయనతోనే నేరుగా పంచుకున్నారట ప్రియ.
ఆ రోజు ఇంటర్వ్యూలో నిన్ను చూసి 'నువ్వు చాలా రూడ్‌గా ఉన్నావ్ డూడ్' అని మనసులో అనుకున్నానని ధనుష్‌తో నేరుగా చెప్పేశాను అంటూ నవ్వేశారు. ఈ అనుభవం ద్వారా జీవితంలో ఒక మంచి పాఠం నేర్చుకున్నానని ప్రియ అన్నారు.
బయటకు కనిపించే ఎవరి అహంకారం లేదా నిర్లక్ష్యం వెనుకైనా వారి సొంత సమస్యలు, తీవ్రమైన ఒత్తిడి ఉండే అవకాశం ఉందని, ఒకరిని త్వరగా జడ్జ్ చేయకూడదని ఆమె చెప్పుకొచ్చారు.




