ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు: ప్రకాష్ రాజ్
Prakash Raj: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘ట్విట్టర్ వార్’ పీక్స్‌కు చేరింది.
ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు: ప్రకాష్ రాజ్
Prakash Raj: మెగా బ్రదర్ కొణిదెల నాగబాబు, వర్సటైల్ యాక్టర్ ప్రకాశ్ రాజ్ మధ్య సోషల్ మీడియా వేదికగా మరోసారి ‘ట్విట్టర్ వార్’ పీక్స్‌కు చేరింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లీడర్‌షిప్‌ను సమర్థిస్తూ నాగబాబు పెట్టిన ఒక పోస్ట్.. టాలీవుడ్‌తో పాటు ఇరు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఒకేసారి తీవ్ర సంచలనం రేపింది. నాగబాబు చెప్పిన ‘బ్లైండ్ ఫాలోయింగ్’ సిద్ధాంతానికి.. “మేము గొర్రెలం కాదు బానిసలుగా బతకడానికి” అంటూ ప్రకాశ్ రాజ్ ఇచ్చిన మైండ్ బ్లాంక్ కౌంటర్ ఇప్పుడు నెట్టింట దావానలంలా వ్యాపిస్తోంది.
“ప్రశ్నించకుండా లీడర్‌ను ఫాలో అవ్వండి”.. నాగబాబు పోస్ట్
సమాజంలో లేదా ఒక వ్యవస్థలో నాయకుడి పాత్ర ఎంత ముఖ్యం అనేదానిపై నాగబాబు తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పవన్ కల్యాణ్ ఫొటోను జత చేస్తూ ఒక సుదీర్ఘమైన వ్యాఖ్యను పంచుకున్నారు. “నాయకుడి మాటే శాసనం. ఆయన ప్రయాణంలో ఎదుర్కొనే రాక్షసులను, అడ్డంకులను ఎవరూ చూడరు. ఏది తప్పు, ఏది రైట్ అనేది కేవలం ఆ లీడర్‌కు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీ సందేహాలను పక్కన పెట్టండి, ఎలాంటి ప్రశ్నలు అడగకండి. జస్ట్ మీ లీడర్‌ను గుడ్డిగా ఫాలో అవ్వండి” అంటూ నాగబాబు అందులో పేర్కొన్నారు. ఎవరూ నోరెత్తకుండా, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా నాయకుడి వెనుక నడవాలనేది ఈ పోస్ట్ యొక్క సారాంశం.
“మేము గొర్రెలం కాదు”.. ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్
నాగబాబు చేసిన ఈ ‘బ్లైండ్ ఫాలోయింగ్’ (గుడ్డిగా అనుసరించడం) వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్ రాజ్ అత్యంత తీవ్రంగా స్పందించారు. నాగబాబు ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ, ఆంగ్లం , తెలుగు భాషల్లో కలిపి ఒక పవర్‌ఫుల్ కౌంటర్ ఇచ్చారు. “అసలు 'మీ అనుమానాలను పక్కన పెట్టండి, నోళ్లు మూసుకోండి, ప్రశ్నలు అడగకుండా నాయకుడిని అనుసరించండి' అనడంలో మీ ఉద్దేశం ఏంటి నాగబాబు గారు? మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఇలాంటి బెదిరింపులు మా దగ్గర వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. లేదా నేనే లీడర్‌ని అని అహంకారంతో అనుకునేవాడైనా సరే, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కచ్చితంగా ఉంటుంది. అర్థం అయిందా?” అంటూ నిలదీశారు.
What do you mean by “ Shut your doubts,silence your tongue and follow the Leader without questions” మేము గొర్రెలం కాదు... బానిస బ్రతుకు బ్రతకడానికి.
— Prakash Raj (@prakashraaj) June 6, 2026
ఈ బెదిరింపులు వద్దు @NagaBabuOffl నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు.
ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం… https://t.co/d3Y4nX5XkT
హాట్ టాపిక్‌గా మారిన పాత బంధాలు
గతంలో ప్రకాశ్ రాజ్ ‘మా’ అధ్యక్ష పదవికి పోటీ చేసిన సమయంలో నాగబాబుతో పాటు మెగా కుటుంబం ఆయనకు పూర్తి మద్దతు ప్రకటించింది. అయితే, గత కొంతకాలంగా వివిధ సామాజిక, రాజకీయ అంశాల్లో పవన్ కల్యాణ్‌తో పాటు మెగా ఫ్యామిలీని ప్రకాశ్ రాజ్ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ‘ప్రశ్నించే హక్కు’ వర్సెస్ ‘నాయకుడి పట్ల విధేయత’ అనే అంశంపై వీరిద్దరి మధ్య జరిగిన ఈ డిజిటల్ ఫైట్ ఇప్పుడు నెట్టింట నయా ట్రెండ్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ ఇద్దరి వ్యాఖ్యలపై భిన్న రకాలుగా స్పందిస్తూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు.




