Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్'లో డాన్ లీ ఉన్నాడా? మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారుగా.!

Spirit Movie: సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'స్పిరిట్'లో కొరియన్ యాక్టర్ డాన్ లీ నటిస్తున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదని ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా తెలిపారు.

Ravi
By Ravi
Published on: 21 Aug 2026 10:45 AM IST
Spirit Movie
X

Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్'లో డాన్ లీ ఉన్నాడా? మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారుగా.! 

Spirit Movie: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్‌గా పేరు తెచ్చుకున్న 'స్పిరిట్' సినిమా గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఈ భారీ చిత్రం తెరకెక్కుతోంది.

ఈ ప్రాజెక్ట్‌లో కొరియన్ నటుడు డాన్ లీ నటిస్తున్నట్లు గత కొంతకాలంగా సినీ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలు చూసిన ఫ్యాన్స్ ఈ కాంబినేషన్లపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అయితే ఈ ప్రచారంపై చిత్ర నిర్మాణ వర్గాల నుంచి స్పష్టత వచ్చింది. ఈ వార్తలలో ఎలాంటి నిజం లేదని ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. అభిమానులు సోషల్ మీడియాలో విపరీతంగా హంగామా చేశారు కానీ ఈ కథకు తగినట్టుగా సెట్ కావాలని ఆయన తెలిపారు.

మొదట తాము ఆ నటుడిని సినిమాలో తీసుకుందామని అనుకున్నామని ఆయన వెల్లడించారు. అయితే ఈ సినిమా కథ పూర్తిగా హైదరాబాద్ నగరంలో జరుగుతుందని ఆయన తెలిపారు. సినిమా కథాంశం ప్రకారం హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో బయటి దేశానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టినా అది అంతగా సెట్ అవ్వదని ప్రొడ్యూసర్ వివరించారు.

కథ డిమాండ్ మేరకు నటీనటులను ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ స్పష్టతతో డాన్ లీ నటిస్తున్నారనే వస్తున్న రూమర్స్‌కు పూర్తిగా తెరపడింది. అయినప్పటికీ ఈ సినిమాపై ప్రేక్షకులలో ఉన్న అంచనాలు ఏమాత్రం తగ్గలేదు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా టేకింగ్, ప్రభాస్ మాస్ ఇమేజ్ కలగలిపి ఈ సినిమా వస్తుండటంతో టాలీవుడ్‌లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నటీనటులు అలాగే సాంకేతిక నిపుణుల అధికారిక వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.

Next Story