Posani Krishna Murali: అందుకే శ్రీహరి చనిపోయినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకోలేదు.. పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Posani Krishna Murali: ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు కీలక విషయాలు వెల్లడించారు.
Posani Krishna Murali: అందుకే శ్రీహరి చనిపోయినప్పుడు నేను కన్నీళ్లు పెట్టుకోలేదు.. పోసాని ఆసక్తికర వ్యాఖ్యలు..
Posani Krishna Murali: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ రచయితగా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు అద్భుతమైన కథలు, మాటలు అందించిన పోసాని కృష్ణ మురళి విలక్షణ నటుడిగా కూడా ప్రేక్షకులకు ఎంతో దగ్గరయ్యారు. ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా దివంగత రియల్ స్టార్ శ్రీహరి కెరీర్ ప్రారంభంలో, ఆయన సక్సెస్‌కి తాను అందించిన సహకారం గురించి పోసాని వివరించారు. ఎవరైనా తనను నమ్మితే వాళ్ల కోసం ప్రాణమైనా ఇస్తానని, అలాంటి నమ్మకమే శ్రీహరికి తనపై ఉండేదని ఆయన స్పష్టం చేశారు.
శ్రీహరి కెరీర్‌ను మలుపు తిప్పిన దాదాపు 16 నుంచి 17 సినిమాలకు తాను స్వయంగా స్క్రిప్ట్ అందించానని పోసాని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో రచయితగా తాను రూ. 15 లక్షల పారితోషికం తీసుకుంటున్నా కూడా, కేవలం శ్రీహరిపై ఉన్న ఇష్టంతో రెండున్నర లక్షలకే పనిచేసేవాడినని ఆయన వెల్లడించారు. భద్రాచలం, అయోధ్య రామయ్య లాంటి సూపర్ హిట్ సినిమాలకు తాను స్క్రిప్ట్ అందించానని, షూటింగ్ సమయంలో ఎలాంటి మార్పులు చెప్పకుండా శ్రీహరి తనను గుడ్డిగా నమ్మేవారని చెప్పుకొచ్చారు. శ్రీహరి మరణం తనను ఎంతగానో కలచివేసిందని, అయితే జీవితంలో పుట్టుక, చావు సహజమని తత్వశాస్త్ర కోణంలో తన భావాలను వ్యక్తం చేశారు.
కాగా, ఈ ఇంటర్వ్యూలో నందమూరి హరికృష్ణతో తనకు ఉన్న స్నేహ బంధాన్ని కూడా పోసాని కృష్ణ మురళి పంచుకున్నారు. లాయర్, సీతయ్య లాంటి సినిమాలకు తాను పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ, హరికృష్ణ ఎంతో ఆత్మగౌరవం ఉన్న మనిషి అని కొనియాడారు. ఇద్దరం కలిసి మాట్లాడుకునేటప్పుడు సినిమా ముచ్చట్లు కాకుండా సాధారణ విషయాలనే ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లమని తెలిపారు. తన ఇంటికి వచ్చి సరదాగా గంటల తరబడి గడిపేవారని, ఎవరైనా కష్టపడి పైకి వస్తుంటే ఎన్టీఆర్ లాగే హరికృష్ణ కూడా మనస్ఫూర్తిగా ఆనందించేవారని పోసాని ఎంతో భావోద్వేగంగా వెల్లడించారు.




