Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు.. స్పందించిన జనసేనాని!
Pawan Kalyan Birthday: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీకి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan Birthday: పవన్ కల్యాణ్‌కు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు.. స్పందించిన జనసేనాని!
Pawan Kalyan Birthday: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జన్మదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో విశేష ఆదరణ ఉన్న నాయకుడిగా అభివర్ణిస్తూ, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వ సుపరిపాలనలో ఆయన ముందుండి చేస్తున్న సేవలను ప్రశంసించారు.
పవన్ కల్యాణ్ ఎంతో ప్రజాదరణ పొందిన నాయకుడని, ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను ఆయన ముందుండి నడిపిస్తున్నారని మోదీ కొనియాడారు. ఆయన నిరంతరం ఆరోగ్యంగా ఉంటూ సమాజ సేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ప్రధాని చూపిన అభిమానం, ప్రోత్సాహం ఏపీ ప్రజలకు మరింత నిబద్ధతతో సేవ చేసేలా తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని పవన్ తెలిపారు. 'వికసిత్ భారత్' నిర్మాణం కోసం మోదీ చేస్తున్న కృషి దేశానికే స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.




