పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' వేట మొదలైంది..

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' (2025) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం తెలిసిందే.

Srinivas Rao
Published on: 22 Jun 2026 11:45 AM IST
Pawan Kalyan
X

పవన్ కళ్యాణ్ 'ఓజీ 2' వేట మొదలైంది..

Pawan Kalyan: టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'దే కాల్ హిమ్ ఓజీ' (2025) బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందనే వార్త మెగా అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ విషయాన్ని 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' అధికారికంగా ప్రకటించడంతో, ఇప్పుడు 'ఓజీ 2' (OG 2) అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సూజీత్ దర్శకత్వంలో 'ఓజీ 2'

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కూడా మొదటి భాగం తెరకెక్కించిన దర్శకుడు సూజీత్ వారే రాసి, దర్శకత్వం వహించనున్నారు. అలాగే, మొదటి భాగానికి తన నేపథ్య సంగీతంతో ప్రాణం పోసిన ఎస్.ఎస్. తమన్, ఈ సీక్వెల్ కోసం కూడా మ్యూజిక్ అందించనున్నారు. "పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ప్రకారం, సూజీత్ దర్శకత్వంలో ఓజీ యూనివర్స్ చర్చలు క్రియేటివ్ వర్క్స్‌లో మొదలయ్యాయి" అని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పేర్కొంది.



'సాహో'తో లింక్.. ఓజీ యూనివర్స్ విస్తరణ

'దే కాల్ హిమ్ ఓజీ' (2025) , రాబోయే 'ఓజీ 2' కేవలం సీక్వెల్స్ మాత్రమే కాదు, ఇవి ఒక భారీ 'షేర్డ్ యూనివర్స్'లో భాగమని చిత్రబృందం వెల్లడించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం 'సాహో' (2018) కూడా ఈ యూనివర్స్‌లో భాగమే. దీంతో పవన్ కళ్యాణ్ , ప్రభాస్ సినిమాల కలయికపై ఇప్పుడు భారీ చర్చ జరుగుతోంది.

'అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు..'

ఈ సీక్వెల్ ప్రకటనపై మొదటి భాగంలో నటించిన నటుడు అర్జున్ దాస్ తనదైన శైలిలో స్పందించారు. "అలాంటోడు మళ్లీ తిరిగి వస్తున్నాడు అంటే.." అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. 'దే కాల్ హిమ్ ఓజీ'లో ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ నటన, ఆయన పలికించిన సంభాషణలు, యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గ్యాంగ్‌స్టర్ పాత్రలో ఆయన చూపిన విలక్షణత ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది.

మొత్తానికి, పవన్ కళ్యాణ్-సూజీత్ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ 'ఓజీ 2' బాక్సాఫీస్ వద్ద మరోసారి రికార్డులను తిరగరాయడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story