‘ఓ సుకుమారి’ టీజర్ విడుదల.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ల కొత్త ప్రేమకథ!

Oh Sukumari: యంగ్ సెన్సేషన్ తిరువీర్, వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ.. సుకుమారి’ .

Srinivas Rao
Updated on: 13 Jun 2026 1:10 PM IST
Oh Sukumari
X

‘ఓ సుకుమారి’ టీజర్ విడుదల.. తిరువీర్, ఐశ్వర్య రాజేష్‌ల కొత్త ప్రేమకథ!

Oh Sukumari: వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ సెన్సేషన్ తిరువీర్, వెర్సటైల్ నటి ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ.. సుకుమారి’ . గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వరరెడ్డి మూలి నిర్మిస్తున్న ఈ రూరల్ రొమాంటిక్ కామెడీ చిత్రంతో భరత్ దర్శన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిలేరియస్ అండ్ ఇంట్రెస్టింగ్ టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ముట్టుకుంటే ‘షాక్’ కొట్టే సుకుమారి!

పక్కా పల్లెటూరి నేపథ్యంలో సాగే అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. గ్రామంలో తిరుగుతూ, లోకల్ పాలిటిక్స్‌లో వేలు పెడుతూ అల్లరిగా తిరిగే యాదగిరి (తిరువీర్) అనే ఒక కేర్‌ఫ్రీ యువకుడి కథ ఇది. ఎలాగైనా ఒక మంచి, సున్నితమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతనికి దామిని (ఐశ్వర్య రాజేష్) పరిచయమవుతుంది. ఆమెను చూడగానే ప్రేమలో పడిపోయి, వెంటనే పెళ్లి పీటలు ఎక్కాలని ఫిక్స్ అయిపోతాడు.



అయితే, అక్కడే కథలో అసలైన ట్విస్ట్ మొదలవుతుంది. దామిని కుటుంబం ఒక వింతైన కండిషన్ పెడుతుంది. అదేంటంటే.. ఆమెను తాకితే చాలు అవతలి వారికి గట్టిగా కరెంట్ షాక్ కొడుతుంది! ఈ వింత సమస్య వెనుక ఉన్న రహస్యం ఏంటి? ముట్టుకుంటేనే షాక్ కొట్టే సుకుమారితో మన యాదగిరి లవ్ స్టోరీ ఎలా సాగింది? చివరకు పెళ్లి పీటల దాకా ఎలా వెళ్ళింది? అనే సరికొత్త ఫాంటసీ , కామెడీ లైన్‌తో ఈ సినిమాను రూపొందించారు.

నవ్వులు పూయించిన తిరువీర్.. ఆకట్టుకున్న టెక్నికల్ వాల్యూస్

ఇప్పటివరకు సీరియస్ , కంటెంట్ ఓరియెంటెడ్ పాత్రల్లో కనిపించిన తిరువీర్, ఈ సినిమాలో పక్కా మాస్ పల్లెటూరి కుర్రాడిగా అదిరిపోయే కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. ఐశ్వర్య రాజేష్ తన నటనతో , పాత్రలోని సస్పెన్స్‌తో ఆకట్టుకోగా.. ఝాన్సీ, ఆమని, మురళీధర్ గౌడ్ లతో కూడిన సపోర్టింగ్ కాస్ట్ కామెడీ ట్రాక్ టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

సాధారణ విలేజ్ లవ్ స్టోరీకి కరెంట్ షాక్ అనే ఒక ఊహించని ఇమాజినేటివ్ ట్విస్ట్‌ను యాడ్ చేసి, దర్శకుడు భరత్ దర్శన్ క్లీన్ రూరల్ కామెడీని ప్రెజెంట్ చేశారు.

భారీ సాంకేతిక బృందం..

గతంలో ‘శివమ్ భజే’ వంటి విలక్షణమైన సినిమాను అందించిన గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఈ సినిమాను కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది. ‘పొలిమేర’, ‘రాజకార్’ చిత్రాల ఫేమ్ సిహెచ్ కుషేందర్ అందించిన విజువల్స్ పల్లెటూరి వాతావరణాన్ని చాలా అందంగా చూపించాయి. ఎంఎం కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లోని ఫన్‌ను మరింత ఎలివేట్ చేసింది. ‘బలగం’ ఫేమ్ తిరుమల ఎం. తిరుపతి ఆర్ట్ వర్క్, ‘కా’ ఫేమ్ శ్రీ వరప్రసాద్ ఎడిటింగ్ ఈ చిత్రానికి అదనపు బలాన్ని చేకూర్చాయి.

ప్రస్తుతం డబ్బింగ్ పనులను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ‘ఓ.. సుకుమారి’ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో బహుభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫన్-ఫిల్డ్ టీజర్ సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story