Resident Evil: భయపెట్టేందుకు వస్తోన్న ‘రెసిడెంట్ ఈవిల్’.. ట్రైలర్ రిలీజ్

Resident Evil: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా వస్తున్న సరికొత్త చిత్రం ‘రెసిడెంట్ ఈవిల్’.

Srinivas Rao
Published on: 25 July 2026 5:05 PM IST
Resident Evil
X

Resident Evil: భయపెట్టేందుకు వస్తోన్న ‘రెసిడెంట్ ఈవిల్’.. ట్రైలర్ రిలీజ్

Resident Evil: ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ప్రముఖ వీడియో గేమ్ ఫ్రాంచైజీ ఆధారంగా వస్తున్న సరికొత్త చిత్రం ‘రెసిడెంట్ ఈవిల్’. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఈ ఫిల్మ్ సిరీస్‌కు సంబంధించి వస్తున్న ఈ రీబూట్ చిత్రం సెప్టెంబర్ 18న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

జాచ్ క్రెగర్ దర్శకత్వంలో సర్వైవల్ హర్రర్ థ్రిల్లర్!

‘బార్బేరియన్’ (2022), ‘వెపన్స్’ (2025) వంటి ప్రశంసలు పొందిన చిత్రాల దర్శకుడు జాచ్ క్రెగర్ ఈ రీబూట్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. జాచ్ క్రెగర్‌తో కలిసి షే హాటెన్ ఈ చిత్రానికి కథను అందించారు. ప్రసిద్ధ ఫస్ట్-పర్సన్ షూటర్ వీడియో గేమ్ ఆధారంగా, కల్పిత అమెరికన్ నగరమైన రాకూన్ సిటీ నేపథ్యంలో జోంబీలతో కూడిన భయానక వాతావరణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.

లీడ్ యాక్టర్స్ … టెక్నిక్ టీమ్ వివరాలు

దర్శకుడు జాచ్ క్రెగర్‌తో గతంలో ‘వెపన్స్’ చిత్రంలో పనిచేసిన ఆస్టిన్ అబ్రమ్స్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఒక మెడికల్ కొరియర్ 'బ్రియాన్' పాత్రలో కనిపించనున్నారు. రాకూన్ సిటీకి ఒక పార్శిల్ అందజేయడానికి వెళ్లే క్రమంలో, జోంబీలతో నిండిన నగరంలో ఒక రాత్రి ప్రాణాలతో బయటపడటానికి ఆయన చేసే పోరాటమే ఈ చిత్ర కథాంశం. ఈ చిత్రంలో జాచ్ చెర్రీ, కాలి రీస్, పాల్ వాల్టర్ హౌసర్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

దర్శకుడు జాచ్ క్రెగర్‌తో పాటు రాబర్ట్ కుల్జెర్, రాయ్ లీ, మిరి యూన్, కార్టర్ స్వాన్, అసాద్ ఖిజిల్బాష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story