NTR - Prashanth Neel: ఆగిపోయిన ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా.. అక్కడే తేడా కొట్టింది

NTR - Prashanth Neel: జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా షూటింగ్‌కు తాత్కాలిక విరామం పడింది.

Naresh.k
Published on: 8 April 2026 9:57 AM IST
NTR  - Prashanth Neel
X

 NTR - Prashanth Neel: ఆగిపోయిన ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా.. అక్కడే తేడా కొట్టింది

NTR - Prashanth Neel: టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ,ఇండియన్ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలయికలో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 'డ్రాగన్' (వర్కింగ్ టైటిల్) ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేవలం ఒక లుక్ కోసం ఈ సినిమా షూటింగ్‌కు చిత్ర బృందం తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది.

ప్రశాంత్ నీల్ పర్ఫెక్షన్

ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోల ఎలివేషన్స్, వారి మేకోవర్ ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే 'డ్రాగన్' సినిమాలో ఎన్టీఆర్‌ను ముందెన్నడూ చూడని విధంగా చూపించాలని ప్రశాంత్ ఒక స్పెషల్ లుక్‌ను డిజైన్ చేశారు. ఈ నెలలో జరగాల్సిన భారీ యాక్షన్ షెడ్యూల్ కోసం ఈ లుక్ చాలా కీలకం. అయితే, షూటింగ్ ప్రారంభించే సమయానికి తారక్ మేకోవర్ , ఆ పర్టికులర్ లుక్ విషయంలో ప్రశాంత్ నీల్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదని సమాచారం.

సాధారణంగా ఏ దర్శకుడైనా షెడ్యూల్స్ ఆలస్యం కాకూడదని రాజీ పడతారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం పర్ఫెక్షన్ విషయంలో వెనక్కి తగ్గలేదు. ఇదే విషయాన్ని తారక్‌తో చర్చించగా, ఆయన కూడా దర్శకుడి విజన్‌కే మద్దతు పలికారని టాక్. సినిమా కాస్త ఆలస్యమైనా పర్లేదు, కానీ ప్రేక్షకులకు బెస్ట్ అవుట్‌పుట్ ఇవ్వాలి.. అనుకున్న లుక్ పర్ఫెక్ట్‌గా వచ్చిన తర్వాతే కెమెరా ముందుకు వెళ్దాం అని ఎన్టీఆర్ అన్నట్లు ఇన్సైడ్ వర్గాల భోగట్టా.

హీరోయిన్‌గా రుక్మిణి వసంత్..

కన్నడ సెన్సేషన్ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు శరవేగంగా సాగింది. తాజాగా ప్లాన్ చేసిన యాక్షన్ ఎపిసోడ్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు తారక్ లుక్ కోసం తీసుకున్న ఈ చిన్న విరామం తర్వాత, మరింత పవర్‌ఫుల్ షెడ్యూల్‌తో టీమ్ రంగంలోకి దిగనుంది. ఈ గ్యాప్‌లో తారక్ తన ఫిజిక్ ,లుక్‌పై మరింత ఫోకస్ పెట్టబోతున్నారట.

అంచనాలు ఆకాశంలో..

'ఆర్ఆర్ఆర్' , 'దేవర' చిత్రాలతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్, 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ చేతులు కలపడంతో ఈ ప్రాజెక్టుపై నేషనల్ లెవల్‌లో భారీ క్రేజ్ ఉంది. ఎన్టీఆర్ కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్,హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది. చిన్న విషయంలో కూడా రాజీ పడకుండా ప్రశాంత్ నీల్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు చూస్తుంటే, వెండితెరపై మరో 'డ్రాగన్' విధ్వంసం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Naresh.k

Naresh.k

Next Story