Nikita Rawal: స్టేజ్‌పై అందరు చూస్తుండగానే హీరోయిన్‌కు లిప్‌లాక్

Nikita Rawal: బాలీవుడ్ నటి నికితా రావల్‌కు ఒక పబ్లిక్ ఈవెంట్‌లో చేదు అనుభవం ఎదురైంది.

Naresh.k
Published on: 10 Aug 2026 12:00 PM IST
Nikita Rawal
X

Nikita Rawal: స్టేజ్‌పై అందరు చూస్తుండగానే హీరోయిన్‌కు లిప్‌లాక్

Nikita Rawal Lip Kiss: సోషల్ మీడియా యుగంలో స్టార్లకు అభిమానుల ప్రేమాభిమానాలు ఎంత ఆనందాన్ని ఇస్తాయో, కొన్నిసార్లు ఆ అభిమానమే సరిహద్దులు దాటి చేదు అనుభవాలను కూడా మిగులుస్తుంది. తాజాగా బాలీవుడ్ నటి, మోడల్ నికితా రావల్‌కు ఒక పబ్లిక్ ఈవెంట్‌లో సరిగ్గా అలాంటి అనుభవమే ఎదురైంది. సదరు కార్యక్రమానికి హాజరైన నికితా రావల్‌ను చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్టేజ్ పైకి వచ్చిన ఆమె చిరునవ్వుతో వారందరినీ పలుకరిస్తూ సందడి చేశారు. అభిమానుల కోరిక మేరకు నికితా ఓపికగా వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు.

ఒక మహిళా అభిమాని ఫొటో దిగేందుకు దగ్గరకు రాగా, నికితా ఆమెను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ఆ అభిమాని మొదట నికితా చెంపపై ముద్దు పెట్టి, ఆ వెంటనే అనూహ్యంగా ఆమె పెదవులపై ముద్దు పెట్టింది. ఈ ఊహించని పరిణామంతో నికితా రావల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరుగుతుందో కోలుకునేలోపే జరిగిన ఈ ఘటనతో ఆమె తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోపై నెటిజన్లు, నికితా అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అభిమానం చూపించడం మంచిదే అయినా, ఎదుటివారి అనుమతి లేని వ్యక్తిగత పరిమితులను దాటడం ఏమాత్రం సరైనది కాదని మండిపడుతున్నారు. బహిరంగ ఈవెంట్లలో సెలబ్రిటీల భద్రత, ప్రైవసీ విషయంలో నిర్వాహకులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అభిమానం పేరుతో సరిహద్దులు దాటడం ప్రేమాభిమానం అనిపించుకోదని, సెలబ్రిటీల ప్రైవసీకి గౌరవం ఇవ్వడం ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story