కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్.. ‘NBK111’ నుండి షాకింగ్ డీగ్లామ్ ఫస్ట్ లుక్ అవుట్!

NBK111: బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’.

Srinivas Rao
Published on: 19 Jun 2026 12:31 PM IST
Kajal Aggarwal
X

కాజల్ అగర్వాల్ బర్త్‌డే స్పెషల్.. ‘NBK111’ నుండి షాకింగ్ డీగ్లామ్ ఫస్ట్ లుక్ అవుట్!

Kajal Aggarwal: నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ అండ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘NBK111’. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవల బాలయ్య బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేయగా.. తాజాగా ఈ చిత్రం నుండి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.

ఎప్పుడూ చూడని లుక్‌లో చందమామ..

ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. సాధారణంగా గ్లామరస్, బబ్లీ క్యారెక్టర్లలో మెరిసే కాజల్‌ను ఈ సినిమాలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని సరికొత్తగా ఆవిష్కరించారు. పోస్టర్‌లో కాజల్ చాలా ఇంటెన్సివ్, పవర్‌ఫుల్ డీగ్లామ్ లుక్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఈ యాక్షన్ ఎండ్ ఎమోషనల్ డ్రామాలో ఆమె పాత్ర చాలా విలక్షణంగా, కథను మలుపు తిప్పే విధంగా ఉండబోతోందని ఈ లుక్ చూస్తేనే స్పష్టమవుతోంది.

రేసులోకి మంచు మనోజ్.. ముంబైలో శరవేగంగా షూటింగ్!

ఈ సినిమాలో మరో సెన్సేషనల్ ఎలిమెంట్ ఏంటంటే.. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎనర్జీకి తోడు మంచు మనోజ్ స్క్రీన్ ప్రెజెన్స్ తోడవ్వడం సినిమాపై హైప్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.

బాలయ్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ మూవీ!

ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి హై-ఆక్టేన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాస్ సాంగ్స్ అందిస్తున్నారు. బలమైన క్యారెక్టరైజేషన్లు, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఎపిసోడ్స్, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతున్న ‘NBK111’ బాలకృష్ణ కెరీర్‌లోనే మరో మైలురాయిగా నిలిచిపోతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కాజల్ బర్త్‌డే లుక్ రిలీజ్‌తో ఈ సినిమాపై టాలీవుడ్‌లో సరికొత్త చర్చ మొదలైంది!

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలు అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏపీ7 ఏఎంలో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story