The Paradise: ‘జడల్ జమానా’.. ఏం ప్లాన్ చేస్తున్నారు భయ్యా? పిచ్చెక్కిస్తున్న పోస్టర్
The Paradise: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 'ది ప్యారడైజ్' సినిమా నుండి మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే పోస్టర్‌ను విడుదల చేశారు.
The Paradise: ‘జడల్ జమానా’.. ఏం ప్లాన్ చేస్తున్నారు భయ్యా? పిచ్చెక్కిస్తున్న పోస్టర్
The Paradise: 'హిట్-3' సక్సెస్ తర్వాత టాలీవుడ్ హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం 'ది ప్యారడైజ్'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఈ నెల 6న ఈ సినిమా నుంచి టీజర్ రానున్న సంగతి తెలిసిందే. సినిమాపై హైప్ మరింత పెంచే ఉద్దేశంతో మూవీ టీమ్ తాజాగా సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ఇందులో నాని జడలతో ఉంటూ పంచ్ ఇస్తున్న రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు.
సుమారు 1.35 నిమిషాల నిడివి ఉండే టీజర్‌లోనిదే ఈ లుక్ అని తెలుస్తోంది. అంతేకాకుండా 'జడల్ జమానా బిగిన్స్' అంటూ మేకర్స్ ఆసక్తికర క్యాప్షన్‌తో ఈ పోస్టర్‌ను రాసుకొచ్చారు. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
కాగా, శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే సినీ వర్గాల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. డిఫరెంట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి. త్వరలో విడుదల కానున్న టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.




