The Paradise Movie: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్‌పై ట్రోలింగ్.. అక్కడే తేడా కొట్టింది..!
The Paradise Movie: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ టీజర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. నాని యాక్టింగ్ టాప్ ఉన్నా, సౌండ్ మిక్సింగ్ పై విమర్శలు వస్తున్నాయి.
The Paradise Movie: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్‌పై ట్రోలింగ్.. అక్కడే తేడా కొట్టింది..!
The Paradise Teaser: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, సినీ అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 'దసరా' వంటి మాస్ బ్లాక్‌బస్టర్ తర్వాత వీరి కలసి చేస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ది ప్యారడైజ్’. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఒక ప్రత్యేకమైన, కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ కూడా ఈ చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన 'ఆయా షేర్' సాంగ్ చార్ట్‌బస్టర్‌గా నిలిచి, సోషల్ మీడియాలో విపరీతంగా మార్మోగుతోంది.
తాజాగా విడుదలైన టీజర్‌లో నేచురల్ స్టార్ నాని పర్ఫార్మెన్స్, ఆయన మేకోవర్ అరాచకంగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. రా, వింటేజ్ అండ్ వైలెంట్ లుక్‌లో నాని నటన నెక్స్ట్ లెవెల్‌లో ఉందంటూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే, ఈ టీజర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
టీజర్ అంతటా వయోలెన్స్ డామినేషన్ ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. టీజర్‌లో నాని చెప్పే డైలాగులు సరిగ్గా వినిపించడం లేదని, నేపధ్య సంగీతం డైలాగ్స్‌ను ఓవర్ టేక్ చేసిందని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇంత పెద్ద సినిమా టీజర్ రీ-మిక్సింగ్, సౌండ్ డిజైనింగ్ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోలేదా? అని మేకర్స్‌ను నెటిజన్లు నిలదీస్తున్నారు. టీజర్ కట్ కాస్త కన్ఫ్యూజింగ్‌గా ఉండటంతో అసలు ఏం చెప్పాలనుకున్నారో అర్థం కాక కొందరు తలలు పట్టుకుంటున్నారు.
ఒకవైపు విమర్శలు వస్తున్నప్పటికీ, నాని అభిమానులు మాత్రం టీజర్‌కు 100కి 100 మార్కులు వేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ రా ఫిల్మ్‌మేకింగ్, నాని ఇంటెన్స్ నటన సినిమాపై అంచనాలను పెంచేశాయని, థియేటర్లలో ఈ మాస్ జాతర వేరే లెవెల్‌లో ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఏది ఏమైనా, విడుదలకు ముందే ఈ స్థాయిలో చర్చ జరగడం ‘ది ప్యారడైజ్’ చిత్రానికి భారీ హైప్‌ను తెచ్చిపెట్టింది. మేకర్స్ ఈ సౌండ్ ఫీడ్‌బ్యాక్‌ను తీసుకొని ట్రైలర్ సమయానికి మార్పులు చేస్తారేమో వేచి చూడాలి.




