Nandha: ఇలాంటి క్లైమాక్స్‌ మరే సినిమాలో కనిపించదు...విషాదమే కానీ సూపర్‌ హిట్‌

క్లైమాక్స్‌లో హీరో మరణిస్తే ఆ సినిమా ప్లాప్‌ అంటాం. కానీ, నంద సినిమా దానికి భిన్నంగా కన్నీళ్లు పెట్టిస్తుంది. బాక్సీఫీస్‌ వద్ద సూపర్‌ హిట్‌ కొట్టింది.

Balachander
Published on: 6 Jun 2026 3:04 PM IST
Nandha: ఇలాంటి క్లైమాక్స్‌ మరే సినిమాలో కనిపించదు...విషాదమే కానీ సూపర్‌ హిట్‌
X

Nandha: సాధారణంగా సినిమాల్లో హ్యాపీ ఎండింగ్‌ కావాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ఆ సినిమా పాత్రలు అందులోని సన్నివేశాలే ప్రేక్షకులను వెంటాడుతుంటాయి. సుఖవంతమైన ఎండిండ్‌ ఉంటే హాయిగా ఉంటుంది అన్నది ప్రేక్షకుల మనోభావం. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న సినిమా ఎండింగ్‌ చాలా విషాదంగా ఉంటుంది. క్లైమాక్స్‌ చూస్తున్నంతసేపు కన్నీళ్లు ఆగవు. క్లైమాక్స్‌లో హీరో చనిపోతే సినిమా ప్లాప్‌ అవుతుందనే నానుడి ఉంటుంది. కానీ, కొన్ని సినిమాలకు ఇది మినహాయింపు. అలాంటి మినహాయింపు ఉన్న సినిమానే ఈ నంద.

బాలా మాయాజాలం...నంద

నంద సినిమా కథపరంగా చూస్తే పెద్ద గొప్పగా ఏం ఉండదు. పల్లెటూరులో ఉండే ఓ కుటుంబం రామేశ్వరానికి వెళ్తారు. అక్కడ తండ్రి వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే తల్లి నిలదీస్తుంది. ఆ సమయంలో వారి కుమారుడు తండ్రిపై తిరగబడి చంపేస్తాడు. దీంతో తల్లి అతని చెల్లి ఒంటరివారవుతారు. కుమారుడు నంద బాలగృహంలో జీవితాన్ని గడుపుతాడు. బయటకు వచ్చిన తరువాత అతడిని తల్లి దగ్గరకు చేరనివ్వదు. కానీ, కష్టపడి చదువుకుంటాడు. తండ్రిని చంపిన హంతకుడు అనే పేరుతో కాలేజీలో సీటు ఇవ్వకపోవడంతో... రామనాథపురానికి చెందిన ఓ జమిందారు చేరదీస్తాడు. అతనికి అండగా ఉంటున్న సమయంలో జమిందారును సొంతవారే చంపి నందపైకి తోస్తారు. చేయని నేరానికి శిక్ష పడే అవకాశం ఉండటంతో కోర్టులోని హత్య చేయాలని అనుకున్నా... నేరం రుజువుకాకపోవడంతో విడుదల అవుతాడు నంద. ఇంటికి వచ్చిన నందలో నేర ప్రవృత్తి, హత్య చేసే గుణం తగ్గిపోలేదని భావించి కొడుకును చంపాలని నిర్ణయించుకుంటుంది. అన్నంలో విషం కలిపి తినిపిస్తుంది. తల్లి స్వయంగా తినిపించడంతో విషమే అయినా ఆనందంగా తింటాడు. తల్లిఒడిలోనే మరణిస్తాడు. ఆ షాక్‌తో తల్లికూడా మరణిస్తుంది.

విషాదమే కానీ హిట్‌

నంద పాత్రలో సూర్య నటన అద్భుతం అనే చెప్పాలి. సాధారణంగా ఇలాంటి ముగింపు ఉన్న సినిమాలను ప్రేక్షకులు తిరస్కరిస్తారనే భావన ఉండేది. కానీ, ఈ సినిమాకు అపూర్వమైన విజయాన్ని అందించారు. దర్శకుడు బాల సేతు సినిమాతో హిట్‌ అందుకున్నాడు. ఆ సినిమా కూడా విషాధకరమైన ఎండింగే. అలానే ఈ సినిమాలో శ్రీలంక శరణార్థుల అంశాన్ని జోడించి విషాదకరమైన ముగింపు ఇచ్చినా ప్రేక్షకులు సాదరంగా ఆహ్వానించడం విశేషం. కథ, కథనాలు బలంగా ఉంటే ఎండింగ్‌ ఎలా ఉన్నా చూస్తారని చెప్పడానికి ఈ సినిమా ఓ నిదర్శనం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story