Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ ఫిక్స్.. దసరాకు లాంచ్.! డైరెక్టర్ ఎవరంటే.?
Mokshagna: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది.
Mokshagna: బాలయ్య వారసుడి ఎంట్రీ ఫిక్స్.. దసరాకు లాంచ్.! డైరెక్టర్ ఎవరంటే.?
Mokshagna: నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం ఎట్టకేలకు ఖాయమైనట్లు తెలుస్తోంది. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి తాజా సమాచారం సినీ సర్కిల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఎట్టకేలకు ఖాయమైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ భారీ సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇప్పటికే 'బింబిసార' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న వశిష్ట ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అటు మెగాస్టార్ చిరంజీవితో దర్శకుడు వశిష్ట 'విశ్వంభర' అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చలు పూర్తిగా ముగిశాయని, స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి. రాబోయే దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభోత్సవం నిర్వహించి సినిమాను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటీవల స్వల్పంగా గాయం కావడం, ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స జరగడం వల్ల ఈ ప్రకటన కొద్దిగా ఆలస్యమైనట్లు సమాచారం.
ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్న తరుణంలో త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఎంట్రీ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ట టేకింగ్ తో పాటు మోక్షజ్ఞ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతుందనే అంశంపై టాలీవుడ్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాతో మోక్షజ్ఞ హీరోగా ఎలాంటి విజయాలను అందుకుంటారో చూడాలి. త్వరలోనే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన వెలువడనుంది.




