నందమూరి బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల.. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఏం చెప్పారంటే?
Nandamuri Balakrishna: షూటింగ్‌లో గాయపడిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.
నందమూరి బాలకృష్ణ హెల్త్ బులెటిన్ విడుదల.. ఏఐజీ ఆసుపత్రి వైద్యులు ఏం చెప్పారంటే?
Nandamuri Balakrishna: ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక సినిమా చిత్రీకరణలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య స్థితిపై ఆసుపత్రి వర్గాలు బుధవారం అధికారికంగా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశాయి.
బాలకృష్ణకు జరిపిన పరీక్షల్లో ఎడమ మోకాలి చుట్టూ ఉన్న కణజాలాల్లోకి రక్తం చేరి, వాపు వచ్చినట్లు వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, మోకాలి కండరాల్లో చిన్నపాటి చీలిక (Tear) ఏర్పడి ఉండవచ్చని వైద్య వర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం ఆర్థోపెడిక్ సర్జన్ల పర్యవేక్షణలో బాలకృష్ణకు విస్తృత స్థాయిలో క్లినికల్, డయాగ్నస్టిక్ పరీక్షలు కొనసాగుతున్నాయని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
బాలకృష్ణ అభిమానులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉందమని వైద్యులు హెల్త్ బులెటిన్‌లో స్పష్టం చేశారు. ఆయన త్వరలోనే కోలుకుని తిరిగి షూటింగ్‌లో పాల్గొంటారని ఆశిస్తున్నారు.




