Bigg Boss 10: ఎంగిలి కప్పులు కడిగిన నాగార్జున.. స్టేజిపై రోహిత్ తాట తీస్తూ త్రిగుణ్‌కి పనిష్మెంట్!
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం వీకెండ్ ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగింది.
Bigg Boss 10
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 మొదటి వారం వీకెండ్ ఎపిసోడ్ ఊహించని మలుపులతో సాగింది. ఎంగిలి పాత్రలు కడిగే విషయంలో రోహిత్ చూపించిన నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ కింగ్ నాగార్జున స్వయంగా స్టేజ్‌పై గ్లాసులు కడిగి హౌస్ మేట్స్‌కి షాక్ ఇచ్చారు. రోహిత్ యాటిట్యూడ్‌పై విరుచుకుపడుతూనే, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన త్రిగుణ్‌కి డిఫరెంట్ శిక్ష విధించారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్‌లో గిన్నెలు కడిగే డ్యూటీ వచ్చిన రోహిత్.. ఇతరులు తాగిన ఎంగిలి కప్పులు, తినేసిన ప్లేట్లు నేను కడగను అంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. నా చేతులకు మాయిశ్చరైజర్ పోతుందని, ఎంగిలి పాత్రలు తోమడం తన వల్ల కాదని నెపం నెట్టే ప్రయత్నం చేశాడు. దీనిపై వీకెండ్ ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున తీవ్రంగా పరిగణించారు. హౌస్‌లో ఆటను షేక్ చేసిన ముగ్గురు కంటెస్టెంట్లకు మిల్క్ షేక్స్ ఇచ్చి, ఆ తర్వాత వాళ్లు తాగిన ఎంగిలి కప్పులను నాగార్జున స్వయంగా స్టేజ్‌పై కడిగి చూపించారు. 'ఏ పనీ చిన్నది కాదు, ఏ పనీ తక్కువది కాదు.. అలాంటి ఆలోచనలు ఉంటే ఈ హౌస్‌లో ఉండటానికి అర్హత లేదు' అని నాగార్జున రోహిత్‌కి కోటింగ్ ఇచ్చారు.
త్రిగుణ్‌కు స్పెషల్ శిక్ష
మరొకవైపు హౌస్‌లో రోహిత్‌ని 'పిల్ల బచ్చా, డొల్ల రాజా' అంటూ దారుణమైన పదజాలంతో దూషించిన త్రిగుణ్‌పై కూడా నాగార్జున సీరియస్ అయ్యారు. నాగార్జున ప్రశ్నించగానే త్రిగుణ్ వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, హోస్ట్ ఊరుకోలేదు. ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల నీకు అసలు గుణమే లేదని నిరూపించుకున్నావని మందలించారు. శిక్షగా స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్న ఒక పెద్ద టైర్‌ను ఎత్తుకుని తాను చెప్పే వరకు తిరుగుతూనే ఉండాలని ఆదేశించారు. హౌస్‌లో గొడవలు పెడుతూ కంటెంట్ ఇస్తున్నాడనే ఉద్దేశంతోనే త్రిగుణ్‌ని కొంత మృదువుగా మందలించారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో వ్యక్తమవుతోంది.
చరణ్, చైత్ర ఎలిమినేషన్
మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్ నిర్వహించి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరిచారు. చరణ్, చైత్ర హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. సీక్రెట్ రూమ్ ఉందనే భ్రమలో ఉన్న హౌస్ మేట్స్‌కి నాగార్జున వీడియో కాల్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఎలిమినేట్ అయిన వారిని నేరుగా ఇంటికి పంపించేశామని చెప్పారు. రోహిత్ వల్లే తాను బయటకు రావలసి వచ్చిందని చైత్ర ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు దేబ్జానీ, శాలిని హౌస్ మేట్స్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు.
హౌస్ మేట్స్ హార్ట్ టాస్క్
హౌస్‌లో ఎవరికి ఎవరు దగ్గర, ఎవరికి దూరంగా ఉన్నారనే విశ్లేషణను నాగార్జున చేపట్టారు. చాలామంది కంటెస్టెంట్లు దేబ్జానీని తమ హార్ట్‌కి దగ్గరగా భావిస్తున్నామని చెప్పగా, రోహిత్‌ని తమ మనసుకు దూరంగా పెట్టారని వెల్లడించారు. రోహిత్‌కి సపోర్ట్ చేస్తూ మాట్లాడటానికి ప్రయత్నించిన శాలినికి నాగార్జున క్లాస్ పీకారు. తన యాటిట్యూడ్‌ను మార్చుకోవాలని హెచ్చరించారు. కామెడీ పేరుతో హద్దులు దాటిన రామ్ ప్రసాద్‌కి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ, శాలినికి 500 సార్లు సారీ అని బోర్డుపై రాయాలని విచిత్రమైన పనిష్మెంట్ ఇచ్చారు.




