Naga Chaitanya: ఆ విషయంలో ఆమె తప్పులేదు.. చాలా జాలిగా అనిపిస్తుంది.. నాగ చైతన్య ఎమెషనల్
Naga Chaitanya: శోభిత ధూళిపాళ్లపై వస్తున్న నెగిటివిటీపై నాగచైతన్య స్పందించారు. ఆమె తప్పు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Naga Chaitanya: ఆ విషయంలో ఆమె తప్పులేదు.. చాలా జాలిగా అనిపిస్తుంది.. నాగ చైతన్య ఎమెషనల్
Sobhita Dhulipala: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య తన వ్యక్తిగత జీవితంపై మరోసారి మనసు విప్పారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకున్న చైతన్య, అప్పటి నుంచి సోషల్ మీడియాలో ఎదుర్కొంటున్న ట్రోలింగ్‌పై స్పందించారు. ముఖ్యంగా శోభితపై వస్తున్న నెగిటివిటీ తనను ఎంతగానో కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శోభితతో తన బంధం గురించి మాట్లాడుతూ.. శోభిత విషయంలో నాకు చాలా జాలిగా అనిపిస్తుంది. తను ఏ తప్పూ చేయలేదు, కానీ నెటిజన్లు తనపై అన్యాయంగా నెగిటివిటీని ప్రచారం చేశారు. ఆ సమయంలో తను పడిన బాధను చూసి నేను చాలా వేదనకు గురయ్యాను అని చైతన్య పేర్కొన్నారు. తాము మొదట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమయ్యామని, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుని, పెద్దల అంగీకారంతోనే ఒక్కటయ్యామని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు సమంత కూడా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది డిసెంబర్ 1న దర్శకుడు రాజ్ నిడిమోరును ఈషా ఫౌండేషన్‌లో ఆమె రహస్యంగా వివాహం చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా అటు సమంత, ఇటు చైతన్య ఇద్దరూ గత జ్ఞాపకాలను పక్కన పెట్టి, తమకు నచ్చిన భాగస్వాములతో కొత్త జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.




