కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా సంగీత దర్శకుడు రామానుజన్
Karmeni Selvam Movie: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చక్రి దర్శకత్వంలో రూపొందిన కార్మేని సెల్వం చిత్ర విశేషాలను సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే పంచుకున్నారు
కార్మేని సెల్వం హృదయానికి హత్తుకునే సినిమా సంగీత దర్శకుడు రామానుజన్
Karmeni Selvam Movie: విలక్షణ నటుడు సముద్రఖని, ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటించిన ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మించిన ఈ చిత్రానికి రామ్ చక్రి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు రామానుజన్ ఎంకే తన సంగీత ప్రయాణం మరియు ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
రామానుజన్ మాట్లాడుతూ.. సంగీతం అనేది ఒక వ్యక్తి పని కాదు, అది టీమ్ వర్క్ అని నమ్ముతానని తెలిపారు. "2017లో బెంగళూరులో Musicloud Studio & Technologyని ప్రారంభించాను. ఈ సినిమాకు నా పేరు కాకుండా నా సంస్థ పేరును ప్రకటించాం. దీనిని 'మ్యూజిక్ యాజ్ ఏ సర్వీస్' (MAAS) అంటాము. దీనివల్ల నిర్మాణ వ్యయం తగ్గడమే కాకుండా, ఇందులో పనిచేసిన ప్రతి కళాకారుడికి రాయల్టీలో వాటా లభిస్తుంది. ఇదొక కార్పొరేట్ మోడల్" అని వివరించారు.
‘అరెరె’ పాటకు అద్భుత స్పందన:
తండ్రి-కొడుకుల బంధం నేపథ్యంలో వచ్చే ‘అరెరె’ పాట ఇప్పటికే శ్రోతల మనసు గెలుచుకుంది. ఈ పాటలో భావోద్వేగాన్ని పండించడానికి వైలిన్, ఫ్లూట్ బదులు 'సరంగి' వాయిద్యాన్ని ఉపయోగించినట్లు ఆయన తెలిపారు. సినిమాలో మొత్తం 4 పాటలతో పాటు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించినట్లు పేర్కొన్నారు.
నటులు సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తన పనిలో పూర్తి స్వేచ్ఛనిచ్చారని రామానుజన్ కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాత అరుణ్ రంగరాజులు గారి ప్రోత్సాహం వల్లే ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాకు ప్రాణం పోయగలిగానని చెప్పారు. భవిష్యత్తులో ‘హ్యాపీ డేస్’, ‘ఆనంద్’ వంటి ఫీల్-గుడ్ చిత్రాలకు సంగీతం అందించాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ‘కార్మేని సెల్వం’ ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. హృదయానికి హత్తుకునే ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని రామానుజన్ ధీమా వ్యక్తం చేశారు.
విడుదల తేది: ఏప్రిల్ 3, 2026
నటీనటులు: సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్, లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ, కోతండం, కరణ్ చక్రవర్తి, శంకర నారాయణ్ వి, హరిత పరాకోడ్ తదితరులు.
బ్యానర్: పాత్‌వే ప్రొడక్షన్స్
నిర్మాత: అరుణ్ రంగరాజులు
కథ – దర్శకత్వం: రామ్ చక్రి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: శ్రీ శరవణన్
మ్యూజిక్: MAAS (Music as a Service), Musicloud Studio & Technology
డీఓపీ: యువరాజ్ దక్షన్
ఎడిటింగ్: జగన్ ఆర్వీ, దినేష్ ఎస్
ప్రొడక్షన్ డిజైనర్: శంకర్
లిరిక్స్: మణి అముతవన్, ఉమా దేవి
ఆడియోగ్రఫీ: రాఘవ్ రమేష్
సౌండ్ డిజైన్: రాఘవ్ రమేష్ – హరి ప్రసాద్ MA
ఎగ్జిక్యూటివ్ మేనేజర్: మణి దామోతథరన్
ప్రొడక్షన్ మేనేజర్: వీఆర్ రాంభరత్
మార్కెటింగ్: నాని కాంచనపల్లి - జయరాజ్ గేదెల
పిఆర్‌ఓ: జీకే మీడియా (గణేష్ – కుమార్)




