Mera Naam Joker: ప్రపంచంలో రెండు ఇంటర్వెల్‌లు ఉన్న ఒకే ఒక్క సినిమా... బోర్‌ కొట్టినా చూడాలనిపిస్తుంది

ప్రపంచ సినిమా చరిత్రలో రెండు ఇంటర్వెల్‌లు ఉన్న ఏకైక చిత్రంగా నిలిచిన మేరా నామ్ జోకర్ విశేషాలు తెలుసుకుందాం.

Balachander
Updated on: 5 Jun 2026 2:16 PM IST
Mera Naam Joker: ప్రపంచంలో రెండు ఇంటర్వెల్‌లు ఉన్న ఒకే ఒక్క సినిమా... బోర్‌ కొట్టినా చూడాలనిపిస్తుంది
X

Mera Naam Joker: ఈరోజుల్లో సినిమా థియేటర్లో రెండు గంటలు కూర్చోవాలంటే వామ్మో అనేస్తాం. ఇక సినిమా ఏమాత్రం బోర్‌ అనిపించినా మధ్యలోనే థియేటర్‌ ఖాళీ అవుతుంది. అలాంటి మూడు గంటల మూడున్నర గంటలు కూర్చోవాలంటే... బాప్‌రే అంటాం. కానీ, మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఓ సినిమా ఏకంగా నాలుగు గంటలకు పైగా ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఈ సినిమాలో ఒకటి కాదు రెండు ఇంతర్వెల్‌లు ఉంటాయి. బహుశా ప్రపంచ సినిమా చరిత్రలో ఇలా రెండుసార్లు ఇంటర్వెల్‌లు ఉన్న సినిమా మనకు కనిపించదు. ఒక్కసారి ఇంటర్వెల్‌ తీసుకొని సెకండ్‌ హాఫ్ చూడాలంటే విపరీతంగా కష్టపడే ప్రేక్షకులు ఆ రోజుల్లో ఈ నాలుగు గంటల సినిమాను కదలకుండా ఎలా చూశారో తలచుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది.

మేరా నామ్‌ జోకర్‌

రాజ్‌కపూర్‌కు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న రోజులు అవి. ఆయన తీసిన సినిమాలు బంపర్‌ హిట్‌ అవుతుంటాయి. అయితే, ఆయన ఆసక్తికంగా అప్పటి వరకు ఉన్న పంథాకు వినూత్నంగా సినిమా తీయాలని అనుకున్నాడు. కే ఏ అబ్బాస్‌ అందించిన కథ నచ్చడంతో మేరా నామ్‌ జోకర్‌ నిర్మించాడు. నిర్మాతగా మాత్రమే కాదు ఈ సినిమాకు దర్శకుడు, హీరో కూడా ఆయనే. అయితే, కథనంలో అక్కడక్కడ కొంత బోర్‌ అనిపించినా... పాటలు, నటన, సర్కస్‌ దృశ్యాలు, డెహ్రడూన్‌లో బ్రిటీష్‌ కాలంనాటి భవనాలు అన్నీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలో రాజ్‌ కపూర్‌ ఏకంగా నలుగురితో రోమాన్స్‌ చేస్తాడు. ప్రేమలో పడటం, విడిపోవడం వంటి దృశ్యాలు మనసును కదిలించి వేస్తాయి.

జోకర్‌గా అద్భుతం

ప్రేమలు, రోమాన్స్‌ ఏవీ వర్కౌట్‌ కావు. మనం ప్రేమించిన అమ్మాయిని మరోకరు వివాహం చేసుకుంటే మన మనసు ఊరుకుంటుందా...దేవదాసులా మారిపోతారు కదా. కానీ, రాజ్‌కపూర్‌ అలా కాదు. ఆ బాధ నుంచి బయటపడేందుకు జోకర్‌గా మారిపోతాడు. అందర్నీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. మనసులోని బాధ బయటకు రాకుండా ముఖానికి వేసుకున్న రంగు ఆయన్ను కాపాడుతుంది. బాల్యం నుంచే హీరో ప్రేమ పాఠాలు నేర్చుకోవడం ఈ సినిమాలో చూడొచ్చు. ఆఖరికి స్కూల్‌ టీచర్‌ ప్రేమలో కూడా ఆయన పడిపోతాడు. ఎన్నిసార్లు ప్రేమలో విఫలమైనా మందుబాటిల్‌ పట్టుకొని విరహ గీతాలు పాడుకోడు.

అద్భుత నటకు అపూర్వ ఆదరణ

రాజ్ కపూర్ శైలిలో తాత్వికత, జీవితపు వెలుగు నీడలపై అలౌకిక దృష్టి తో సున్నిత భావనలు, కంటి భాషతో కథనం నడుస్తుంది, చివరికి జీవితం అంటే ఇంతేనా? అనిపిస్తుంది, చిత్రం అంతా రిచ్ గా, మంచి ఫ్రేములు అలరిస్తాయి. రాజ్‌కపూర్‌ పాత్రలో నటిస్తున్నంతసేపు మనకు చార్లీచాప్లిన్‌ గుర్తుకు వస్తాడు. ఇక ఈయన నటకు సోవియట్‌ రష్యాలో భారీగా అభిమానులు ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. ప్రపంచంమే ఓ నాటక రంగం, భగవంతుడు జోకర్‌ రూపం ఎత్తి ప్రతి ఒక్కరినీ ఆడిస్తుంటాడు అన్నది ఈ సినిమా అంతరార్థం. ఒకచోట ప్రేమ రొమాన్స్‌ ముగిసిందిలే అనుకులోగా మరోచోట ప్రేమ చిగురిస్తుంది. ఇలా నలుగు భామల మధ్యన రాజ్‌కపూర్‌ మన్మథుడిలా మెరిసిపోతాడు. కానీ, జోకర్‌లా మిగిలిపోవలసి వస్తుందని అనుకోడు. నాలుగు గంటల సినిమాలు నాలుగు చోట్ల వచ్చే సరికొత్త లవ్‌ స్టోరీలు, సరికొత్త రొమాంటిక్‌ యాంగిల్స్‌ సినిమాకు పెద్ద ప్లస్‌ పాయింట్‌. ఇక ఈ సినిమాలో వచ్చే యే భాయ్ జర దేక్ కె చలో.. జీనా యహా మర్నా యహా , జానే కహా గయే వో దిన్ వంటి పాటలు సూపర్‌ హిట్టయ్యాయి. ఇకపోతే, ఈ సినిమాను స్పూర్తిగా తీసుకొని సింగీతం శ్రీనివాసరావు కమల్‌ హాసన్‌తో విచిత్ర సహోదరులు సినిమాను తీశాడు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story