Pokiri: మెహర్‌ రమేష్‌ సలహాకు పూరీ ఫిదా... టైటిల్‌ మార్చకుంటే అట్టర్‌ ప్లాపయ్యేదేమో

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టించిన పోకిరి సినిమా అసలు టైటిల్‌ ఇదికాదు. టైటిల్‌ మారకుంటే సినిమా యావరేజ్‌గా ఆడేది.

Balachander
Published on: 1 Jun 2026 1:53 PM IST
Pokiri: మెహర్‌ రమేష్‌ సలహాకు పూరీ ఫిదా... టైటిల్‌ మార్చకుంటే అట్టర్‌ ప్లాపయ్యేదేమో
X

Pokiri: తెలుగు సినిమా ప్రేక్షకులపై భారీగా ఇంపాక్ట్‌ చూపిన సినిమాల్లో పోకిరి కూడా ఒకటి. మహేష్‌బాబు స్టార్‌ ఇమేజ్‌ను అమాంతం పెంచింది ఈ సినిమానే. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న రికార్డులను తిరగరాసింది. అయితే, ఈ పోకిరి సినిమాకు పూరీ జగన్నాథ్‌ మొదట అనుకున్న పేరు పోకిరి కాదు. పోకిరి కంటే ముందు ఓ పేరును సిద్దం చేసుకున్నాడు. సినిమా కథను, పేరును ఓ దర్శకుడికి వినిపించగా...ఆయన విని టైటిల్‌కి ఆ పేరు పెడితే కథను ముందుగానే రివీల్‌ చేసినట్టు ఉంటుందని చెప్పి...టైటిల్‌ మార్చాలని సూచించాడు. అన్నీ ఆలోచించిన పూరీ చివరకు పోకిరి టైటిల్‌ను ఖరారు చేశాడు. ప్రీక్లైమాక్స్‌ వరకు ట్విస్ట్‌ రివీల్‌ కాకపోవడంతో సినిమా భారీ హిట్టయింది. 10 కోట్లతో నిర్మించిన ఈ సినిమా 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఒకవేళ ఆ దర్శకుడు టైటిల్‌ను చేంజ్‌ చేయమని చెప్పకుంటే సినిమా యావరేజ్‌ లేదా ప్లాప్‌ అయ్యిండేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

టైటిల్ మారకుంటే ట్విస్ట్ రివీల్ అయిపోయేదే!

‘పోకిరి’ సినిమాకు పూరీ జగన్నాథ్ మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా? "ఉత్తమ్ సింగ్.. సన్నాఫ్ సూర్యనారాయణ". కథ ప్రకారం మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్. అతని తండ్రి పాత్ర పేరు సూర్యనారాయణ. పూరీ ఈ కథను రెడీ చేసుకున్నాక కథ మొత్తాన్ని అప్పటికే ఇండస్ట్రీలో కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించిన మెహర్‌ రమేష్‌కు వినిపించారు. ఆయన కథ విని ఇంప్రెస్‌ అయ్యాడు. కానీ, టైటిల్‌పై కొన్ని సూచనలు చేశాడు. టైటిల్‌లో తండ్రిపేరు పెడితే... దాని ద్వారా కథ మొత్తం రివీల్‌ అవుతుందని, ఫైనల్‌ ట్విస్ట్‌ వరకు ప్రేక్షకులు ఉండాల్సిన అవసరం ఉండదని చెప్పి, టైటిల్‌ రివీల్‌ కాకుండా మహేష్‌బాబు పాత్రను బేస్‌ చేసుకొని టైటిల్‌ పెట్టాలని సూచించాడట. మహేష్‌బాబు పోలీస్‌ అనే సంగతి అస్సలు రివీల్‌ కావొద్దని చెప్పాడు. మెహర్‌ రమేష్‌ చెప్పిన పాయింట్‌ నచ్చడంతో పూరీజగన్నాధ్‌ ఈ సినిమాకు పోకిరి అనే టైటిల్‌ను కన్ఫర్మ్‌ చేశాడు.

బాక్సాఫీస్ వద్ద రూ. 50 కోట్ల క్లబ్ మ్యాజిక్

మెహర్ రమేష్ ఇచ్చిన సలహా ఏ రేంజ్‌లో వర్కవుట్ అయిందో థియేటర్లలో క్లైమాక్స్‌ ట్విస్ట్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అప్పటివరకు చిల్లర రౌడీగా చూసిన పండుగాడు ఒక్కసారిగా పోలీస్ డ్రెస్ వేసుకుని వస్తుంటే ప్రేక్షకులు ఊగిపోయారు. పోకిరి వచ్చిన సమయంలో అంతకు ముందు సినిమా ఎంత పెద్ద హిట్టైనా 30 లేదా 40 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చేవి కాదు. కానీ, మొదటిసారి రూ. 50 కోట్లు వసూలు చేసిన సినిమాగా పోకిరి రికార్డు సృష్టించింది. ఇక ఈ సినిమాలో మహేష్‌బాబు పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాయి. షార్ట్‌గా పవర్‌ఫుల్‌గా ఉండే ఈ డైలాగ్స్‌ కోసమే సినిమాను విపరీతంగా చూశారు.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story