Mega 158: మరోసారి చిరంజీవి-బాబీ కొల్లి కాంబో.. టైటిల్, గ్లింప్స్‌ వచ్చేశాయి.. ఊగిపోతున్న మెగా ఫాన్స్!

Mega 158: . చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘Mega158’ టైటిల్‌ను ‘కాకా’గా ప్రకటిస్తూ మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు.

Rishvik
Published on: 22 Aug 2026 9:58 AM IST
Mega 158
X

Mega 158: మరోసారి చిరంజీవి-బాబీ కొల్లి కాంబో.. టైటిల్, గ్లింప్స్‌ వచ్చేశాయి.. ఊగిపోతున్న మెగా ఫాన్స్!

Mega 158: మెగాస్టార్' చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుండడంతో.. మెగా అభిమానుల్లో మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

చిరు-బాబీ కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘Mega158’తో తెరకెక్కుతోంది. నేడు చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా Mega158 సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను చిత్రబృందం వెల్లడించింది.

చిరంజీవి పుట్టినరోజు కానుకగా ‘Mega158’ టైటిల్‌ను ‘కాకా’గా ప్రకటిస్తూ మేకర్స్ అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా చిరు కనిపించిన విధానం, ఆయన పాత్ర స్వభావాన్ని పరిచయం చేసిన తీరు మెగా అభిమానులను ఆకట్టుకుంటోంది.

గ్లింప్స్‌లో ఆక్వా రంగంలో ‘కె. సత్యం’ అనే సూపర్‌వైజర్‌గా చిరంజీవి ఎంట్రీ ఇస్తారు. చెన్నై టీమ్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ.. లోడ్ సకాలంలో చేరుతుందని భరోసా ఇచ్చే సన్నివేశంతో వీడియో మొదలవుతుంది. అనంతరం సునీల్ పండుగ టార్గెట్ పేరుతో అడిగే లీవ్‌ను చిరంజీవి తిరస్కరించడం ఆసక్తికరంగా చూపించారు.

ఇక గెటప్ శ్రీను స్కూటర్ కీస్ విసిరే సమయంలో అవి అనుకోకుండా నీటిలో పడిపోవడం.. ఓ కుక్క రిమోట్‌ను తీసుకురావడం.. ఆ రిమోట్‌లోని మాగ్నెట్ సాయంతో కీస్‌ను బయటకు తీసే క్రమంలో తుపాకులు బయటకు రావడం వంటి సన్నివేశాలు గ్లింప్స్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సన్నివేశాలతో సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు కామెడీకి కూడా మంచి ప్రాధాన్యం ఉండబోతుందనే ఆసక్తి ఏర్పడింది. గ్లింప్స్‌లో మధ్యవయస్కుడైన సత్యం పాత్రలో చిరంజీవి హుందాగా కనిపించారు.

ఆయన గెటప్, స్క్రీన్ ప్రజెన్స్ మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గ్లింప్స్‌లో కథకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించకుండా.. పాత్ర, వాతావరణం, యాక్షన్ అంశాలపై మాత్రమే హింట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘వాల్తేరు వీరయ్య’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత చిరంజీవి-బాబీ కొల్లి కాంబినేషన్ మళ్లీ రావడంతో ‘కాకా’పై ఇప్పటికే భారీ హైప్ ఉంది. ఈసారి కూడా బాబీ ఒక భారీ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది.

సినిమాలో చిరంజీవి రెండు విభిన్న కోణాల్లో కనిపించనున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘కాకా’ గ్లింప్స్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా మరింత పెరిగాయి. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి-బాబీ జోడీ మరోసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


Rishvik

Rishvik

2016లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, ఆటోమొబైల్స్, పాలిటిక్స్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా స్పోర్ట్స్ గురించి ప్రత్యేక కథనాలు రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story