వచ్చేసింది.. ‘పెద్ది’ పవర్‌ఫుల్ సాంగ్ ‘మస్సా మస్సా’!
ఇప్పుడు వీటి జాబితాలోకి ‘మస్సా మస్సా’ కూడా చేరిపోవడంతో ‘పెద్ది’ ఆల్బమ్ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం.. అటు ప్రమోషన్స్, ఇటు అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే గురువారం నాడు మేకర్స్ ఈ సినిమా నుండి ‘మస్సా మస్సా’ అంటూ సాగే మరో సాలిడ్ అప్‌డేట్‌ను, పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు.
హీరో క్యారెక్టరైజేషన్‌ను ఎలివేట్ చేసే స్ఫూర్తిదాయక గీతం
సినిమాలో హీరో ‘పెద్ది’ క్యారెక్టర్ తీరును, అతడి పవర్‌ఫుల్ మైండ్‌సెట్‌ను చాటిచెప్పేలా ఈ సాంగ్‌ను డిజైన్ చేశారు. ప్రముఖ లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ అందించిన పవర్‌ఫుల్ లిరిక్స్, దానికి తోడు స్టార్ సింగర్ విశాల్ మిశ్రా వాయిస్ ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఆస్కార్ విజేత ఎ.ఆర్. రెహమాన్ అందించిన అదిరిపోయే ట్యూన్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వింటుంటే.. థియేటర్లలో చరణ్ ఎలివేషన్ సీన్స్‌కు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ చార్ట్‌బస్టర్స్.. మ్యూజికల్ హిట్ ‘పెద్ది’
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ప్రతి పాట ఒక సంచలనం సృష్టించింది.‘చికిరి’సాంగ్ రీల్స్, షార్ట్స్‌లో ట్రెండింగ్‌గా నిలిచింది. ‘రయ్ రయ్ రా రా’మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. భోపాల్ ఈవెంట్‌లో రిలీజ్ చేసిన ‘హల్లల్లల్లో నేషనల్ వైడ్‌గా వైరల్ అయింది.
ఇప్పుడు వీటి జాబితాలోకి ‘మస్సా మస్సా’ కూడా చేరిపోవడంతో ‘పెద్ది’ ఆల్బమ్ ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఢిల్లీ ప్రెస్ మీట్‌లో పీఎం మోదీ ఇన్‌స్పిరేషన్ అని చరణ్ లీక్ ఇవ్వడం, ఇపుడు ఈ పవర్‌ఫుల్ సాంగ్ కూడా రావడంతో జూన్ 4న బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ సరికొత్త రికార్డులను వేటాడటం ఖాయంగా కనిపిస్తోంది!




