Maremma: గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన 'మారెమ్మ'!

Maremma: టాలీవుడ్‌లోకి మరో నూతన నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు.

Srinivas Rao
Published on: 23 July 2026 10:58 AM IST
Maremma
X

Maremma: గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైన 'మారెమ్మ'!

Maremma: టాలీవుడ్‌లోకి మరో నూతన నటుడు ఎంట్రీ ఇస్తున్నాడు. మాస్‌ మహారాజా రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న తాజా గ్రామీణ యాక్షన్ డ్రామా 'మారెమ్మ' . మంచాల నాగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని తాజాగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

సెప్టెంబర్ 10న గ్రాండ్ రిలీజ్

గ్రామీణ నేపథ్యంతో కూడిన అచ్చమైన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న 'మారెమ్మ' సినిమాను సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఒక సరికొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో మాధవ్ చాలా రఫ్‌గా, ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక పోరాటయోధుడిలా కనిపించడమే కాకుండా, పవిత్రమైన ఆవుకు, ప్రధాన పాత్రకు మధ్య సాగే ప్రతీకాత్మక సన్నివేశం ఈ సినిమాపై మరింత అంచనాలను పెంచుతోంది. జానపద కథల ఆధారంగా సాగే ఈ చిత్రంలో బలమైన భావోద్వేగాలు ఉన్నట్లు పోస్టర్ ద్వారా తెలుస్తోంది.

గ్రామీణ సంస్కృతి … భావోద్వేగాల సమాహారం

మొక్ష ఆర్ట్స్ పతాకంపై మయూర్ రెడ్డి బండారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇందులో మాధవ్‌ సరసన దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తోంది. స్థానిక సంప్రదాయాలు, బలమైన మానవ సంబంధాలు, పల్లెటూరి వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రం సాగనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచగా, సెప్టెంబర్ 10న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో మాధవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Srinivas Rao

Srinivas Rao

శ్రీనివాస్ రావు జర్నలిజం రంగంలో దశాబ్దానికి పైగా అనుభవం కలిగిన కంటెంట్ రైటర్, సబ్ ఎడిటర్. రాజకీయాలు, ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ, లైఫ్ స్టైల్, క్రైమ్ వంటి విభిన్న అంశాల్లో లోతైన అవగాహనతో స్పష్టమైన, పాఠకులకు సులభంగా అర్థమయ్యే శైలిలో వార్తలను అందిస్తున్నారు. ప్రముఖ మీడియా సంస్థలులో పనిచేసి విలువైన అనుభవాన్ని సంపాదించారు. విశ్లేషణాత్మక దృక్పథంతో వార్తలకు కొత్త కోణాన్ని జోడిస్తూ పాఠకుల విశ్వాసాన్ని పొందుతున్నారు.

Next Story