Varanasi Movie: దసరాకు మహేష్ బాబు 'వారణాసి' నుంచి బిగ్ అప్‌డేట్.! ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..

Varanasi Movie: సూపర్‌ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'వారణాసి' సినిమా నుంచి విజయదశమికి బిగ్ అప్‌డేట్ రానుంది.

Ravi
By Ravi
Published on: 13 Sept 2026 10:05 AM IST
Varanasi Movie
X

Varanasi Movie: దసరాకు మహేష్ బాబు 'వారణాసి' నుంచి బిగ్ అప్‌డేట్.! ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ..

Varanasi Movie: సూపర్‌ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్-వరల్డ్ భారీ చిత్రం 'వారణాసి' పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు సంబంధించి సినీ వర్గాల నుంచి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. విజయదశమి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక భారీ అప్‌డేట్ రానుందని తెలుస్తోంది.

ఆ తర్వాతి నుంచి వరుస అప్‌డేట్‌లను అందించేందుకు మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక స్పష్టత రానుంది.

ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ విజువల్ వండర్ రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా, మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టారు.

ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపించనున్నారు. అలాగే ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, స్టిల్స్ ఈ సినిమాపై అంచనాలు మరింత స్థాయికి పెంచేశాయి.

ఈ భారీ ప్రాజెక్ట్‌ను ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7వ తేదీన థియేటర్లలోకి తీసుకురానున్న సంగతి తెలిసిందే. కాగా, విజయదశమి కానుకగా రాబోతున్న అప్‌డేట్ కోసం మహేష్ బాబు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.