Madhavi Latha: మీ నాన్న కండోమ్ వాడి ఉంటే.. ఈ రోజు ఈ దరిద్రం ఉండేది కాదు
Madhavi Latha: ప్రముఖ ట్రావెల్ యూట్యూబర్ ‘నా అన్వేషణ’ అన్వేష్‌పై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత విరుచుకుపడ్డారు.
Madhavi Latha: మీ నాన్న కండోమ్ వాడి ఉంటే.. ఈ రోజు ఈ దరిద్రం ఉండేది కాదు
Madhavi Latha: తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడూ ట్రావెల్ వ్లాగ్స్‌తో వార్తల్లో ఉండే ప్రముఖ యూట్యూబర్, నా అన్వేషణ ఫేమ్ అన్వేష్.. ఇప్పుడు ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ఒక ఆధ్యాత్మిక గురువును ఉద్దేశించి అన్వేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. దీనిపై నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఊహించని రేంజ్‌లో స్పందించారు. లైవ్ వీడియో వేదికగా ఆమె వాడిన బోల్డ్ పదజాలం, చేసిన ఘాటు వ్యాఖ్యలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఇటీవల యూట్యూబర్ అన్వేష్ ఒక పవిత్ర ఆధ్యాత్మిక గురువు జగద్గురువును ఉద్దేశించి ఎగతాళి చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం, హిందూ పీఠాధిపతులపై ఎవరైనా మాట్లాడితే వెంటనే రియాక్ట్ అయ్యే మాధవీలత.. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. అన్వేష్ అహంకారంతోనే ఇలా మాట్లాడారని మండిపడుతూ.. ఆమె సోషల్ మీడియాలో లైవ్ వీడియో ద్వారా అత్యంత ఘాటుగా స్పందించారు.
లైవ్ వీడియోలో మాధవీలత ఏమాత్రం సంకోచించకుండా, అన్వేష్‌ను టార్గెట్ చేస్తూ అత్యంత బోల్డ్ వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని, పీఠాధిపతులను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను కనేముందు మీ నాన్న కండోమ్ వాడి ఉంటే.. ఈ రోజు సమాజానికి ఈ దరిద్రం వదిలేది అంటూ ఘాటు కామెంట్స్ చేశారు మాధవీలత.
ఆధ్యాత్మిక గురువులను తక్కువ చేసి మాట్లాడటం అన్వేష్ పతనానికి దారితీస్తుందని ఆమె హెచ్చరించారు. నువ్వు ఎంతటి వాడివైనా సరే.. జగద్గురువుపై చేసిన వ్యాఖ్యలకు త్వరలోనే కర్మ అనుభవిస్తావు. దేవుడి స్క్రిప్ట్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది, నీ అంతం నువ్వే చూసుకుంటావు అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టాలీవుడ్‌లో ఒకప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్న మాధవీలత,
ప్రస్తుతం రాజకీయాల్లో, సామాజికాంశాల్లో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ‘నచ్చావులే’, ‘స్నేహితుడా’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ బీజేపీలో చేరారు. హిందూ ధర్మం, సమాజంలో జరిగే అన్యాయాలపై సోషల్ మీడియాలో నిరంతరం గళం విప్పుతున్నారు.
మాధవీలత చేసిన ఈ సంచలన వ్యాఖ్యలతో నెట్టింట పెద్ద ఎత్తున మాటల యుద్ధం మొదలైంది. ఒక మహిళ అయ్యి ఉండి లైవ్‌లో అంతటి దారుణమైన, వ్యక్తిగత పదజాలం ఎలా వాడుతుందంటూ మాధవీలతపై మండిపడుతున్నారు. సనాతన ధర్మాన్ని, హిందూ గురువులను అవమానిస్తే ఇలాంటి స్ట్రాంగ్ కౌంటర్లు పడాల్సిందేనంటూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. యూట్యూబ్ వ్లాగ్‌లతో మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించుకున్న అన్వేష్.. ఈ ఆధ్యాత్మిక వివాదంతో ఒక్కసారిగా డిఫెన్స్‌లో పడ్డారు. మరి మాధవీలత చేసిన ఈ రేంజ్ కామెంట్స్‌పై నా అన్వేషణ అన్వేష్ ఎలా స్పందిస్తారో చూడాలి.




