M4M Release: మే 8న థియేటర్లలోకి ‘ఎం4ఎం’ మర్డర్ మిస్టరీ!

M4M Release: సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ మే 8న ప్రపంచవ్యాప్తంగా 5 భాషల్లో విడుదల కానుంది.

Arun Chilukuri
Published on: 6 April 2026 6:43 PM IST
M4M Release
X

M4M Release: మే 8న థియేటర్లలోకి ‘ఎం4ఎం’ మర్డర్ మిస్టరీ!

M4M Release: ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అమెరికన్ నటి జో శర్మ, సంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు మోహన్ వడ్లపట్ల మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై స్వీయ నిర్మాణంలో రూపొందించారు.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు:

థియేటర్లలో విడుదలకు ముందే ‘ఎం4ఎం’ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ చిత్రానికి ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించగా, సినీ వర్గాల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ముంబైలోని IMPPA ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన ప్రదర్శనకు కూడా ప్రశంసలు దక్కాయి. హీరోయిన్ జో శర్మ అమెరికా మరియు భారతదేశంలో నిర్వహించిన ప్రమోషన్ టూర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.

5 భాషల్లో గ్రాండ్ రిలీజ్:

ఈ చిత్రాన్ని భారతదేశంలో ప్రముఖ సంస్థ PVR Inox Pictures తెలుగు, హిందీ, తమిళ, కన్నడ మరియు మలయాళ భాషల్లో విడుదల చేస్తోంది. అమెరికాలో TekFlix Entertainment, ఉత్తర భారతంలో JVEL Entertainment సంస్థలు పంపిణీ బాధ్యతలు చేపట్టాయి.

చిత్ర విశేషాలను దర్శకుడు-నిర్మాత మోహన్ వడ్లపట్ల పంచుకుంటూ.. "మే 8న మా సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నాం. విడుదలకు ముందే కాన్స్ వంటి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కడం గర్వకారణం. ఉత్కంఠభరితమైన కథనం, సంగీతం ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడతాయని నమ్మకంగా ఉన్నాం" అని తెలిపారు.

బ్యానర్‌: మోహన్ మీడియా క్రియేషన్స్

సహకారం: McWin Group USA

న‌టీన‌టులు: జో శర్మ, సంబీత్ ఆచార్య, త‌దిత‌రులు.

ద‌ర్శ‌క‌త్వం, నిర్మాణం: మోహన్ వడ్లపట్ల

పీఆర్ఓ: ప‌ర్వ‌త‌నేని రాంబాబు, క‌డ‌లి రాంబాబు, అశోక్ ద‌య్యాల‌.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story