Asha Bhosle: ఐసీయూలో లెజెండరీ సింగర్ ఆశా భోస్లే.. ఆందోళనలో అభిమానులు

Asha Bhosle: ప్రముఖ గాయని ఆశా భోస్లే గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల వయసున్న ఆమె ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

Arun Chilukuri
Published on: 11 April 2026 9:59 PM IST
Asha Bhosle
X

Asha Bhosle: ఐసీయూలో లెజెండరీ సింగర్ ఆశా భోస్లే.. ఆందోళనలో అభిమానులు

Asha Bhosle: భారతీయ సంగీత ప్రపంచంలో తన గాత్రంతో దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ సింగర్ ఆశా భోస్లే శనివారం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. 92 ఏళ్ల ఆశా భోస్లేకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలోని ఐసీయూలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందనే దానిపై ఆసుపత్రి వర్గాల నుండి గానీ, కుటుంబ సభ్యుల నుండి గానీ ఇంకా అధికారిక హెల్త్ బులిటెన్ విడుదల కాలేదు. ఆమె త్వరగా కోలుకోవాలని కోట్లాది మంది అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

స్వాతంత్య్రానికి పూర్వం సంగ్లీలో జన్మించిన ఆశా భోస్లే, సంగీత ప్రపంచంలో తిరుగులేని ముద్ర వేశారు. బప్పీలహరి, ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ వంటి దిగ్గజ సంగీత దర్శకులతో పనిచేసి వేలాది మధుర గీతాలను ఆలపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story