Khushbu Sundar: గాయపడిన పులిని నేను..నా బిడ్డల జోలికి వస్తే ఊరుకోను: ఖుష్బూ
Khushbu Sundar: నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన కూతుళ్లు అవంతిక, ఆనందితలపై జరుగుతున్న ఆన్లైన్ దాడుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Khushbu Sundar: గాయపడిన పులిని నేను..నా బిడ్డల జోలికి వస్తే ఊరుకోను: ఖుష్బూ
Khushbu Sundar: నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ తన కూతుళ్లు అవంతిక, ఆనందితలపై జరుగుతున్న ఆన్లైన్ దాడుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్న ట్రోలర్స్‌కు ఆమె గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఒక తల్లిగా తన బిడ్డలను కాపాడుకునేందుకు తాను పులిలా పోరాడతానని ఆమె స్పష్టం చేశారు. ఈ పోరాటంలో నటి రాధికా శరత్‌కుమార్ కూడా ఖుష్బూకు మద్దతుగా నిలిచారు.
పిల్లలను వదిలేయండి".. ఖుష్బూ ఆవేదన
సోషల్ మీడియాలో సెలబ్రిటీల కుటుంబాలను టార్గెట్ చేస్తూ, కేవలం వ్యూస్ , ఫాలోవర్స్ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ఖుష్బూ మండిపడ్డారు. ఆమె తన కుటుంబ ఫోటోను పంచుకుంటూ, తన పిల్లలను తాము ఎంతో పద్ధతిగా పెంచామని, వారు తమ తల్లిదండ్రుల సెలబ్రిటీ హోదాను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదని గుర్తు చేశారు. "కేవలం రెండు నిమిషాల చౌకబారు ప్రచారం కోసం నా బిడ్డలను అవమానిస్తారా?" అని ఆమె ప్రశ్నించారు. తాను మౌనంగా ఉన్నానంటే భయపడ్డారని అనుకోవద్దు, తన పెంపకం , గౌరవం కారణంగానే ఇప్పటివరకు సహించానని, కానీ ఇకపై సహించే ప్రసక్తే లేదని ఆమె హెచ్చరించారు. తన బిడ్డలను కాపాడుకునే విషయంలో తాను "గాయపడిన పులిని" అని ఆమె ఘాటుగా హెచ్చరించారు.
రాధికా శరత్‌కుమార్ మద్దతు: "ఇది పిరికితనం"
ఖుష్బూకు మద్దతుగా నటి రాధికా శరత్‌కుమార్ స్పందిస్తూ, "భావప్రకటనా స్వేచ్ఛ అంటే ఇతరులను వేధించడం కాదు. విమర్శించడం అంటే క్రూరత్వం కాదు, జోక్ చేయడం అంటే అవమానించడం కాదు," అని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి బాహ్య స్వరూపాన్ని చూసి వారి విలువను అంచనా వేయడం, అది కూడా సెలబ్రిటీల పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం అత్యంత పిరికితనమని ఆమె ఖండించారు. ఖుష్బూకు తోడుగా నిలిచిన రాధిక, ఇలాంటి సంస్కారహీనమైన ప్రవర్తనను సమాజం అంగీకరించకూడదని పేర్కొన్నారు.
చిన్నప్పటి నుంచీ వేధింపులు: ఆనందిత ఆవేదన
ఇటీవల ఖుష్బూ కుమార్తె ఆనందిత తనపై జరుగుతున్న ఆన్లైన్ వేధింపుల గురించి ఒక పోడ్కాస్ట్లో బయటపెట్టారు. చిన్నప్పటి నుంచి తాను ఇంటర్నెట్ ట్రోల్స్‌కు బలైతున్నానని, ముఖ్యంగా ట్రాన్్్జెండర్తో పోల్చుతూ తనపై చేస్తున్న వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం తనను అవమానించడమే కాకుండా, సమాజంలోని మూఢత్వాన్ని , ట్రాన్స్‌ఫోబియాను ప్రతిబింబిస్తోందని ఆమె స్పష్టం చేశారు. ఆనందిత ప్రస్తుతం చలనచిత్ర రంగంలో క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉన్నారు. సెలబ్రిటీ పిల్లలపై జరుగుతున్న ఈ తరహా సైబర్ దాడులపై ఇప్పుడు సినీ పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.




