Kate Winslet Titanic Secret: టైటానిక్ హీరోయిన్ దాచిన సీక్రెట్... అభిమానులకు షాకిచ్చిన కేట్ విన్స్లెట్
టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ చాలా ఏళ్ల తర్వాత వెల్లడించిన ఆసక్తికరమైన రహస్యం ఇప్పుడు సినీ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. లియోనార్డో డికాప్రియోతో మొదటి రోజు షూటింగ్‌లో జరిగిన సంఘటన, వారి స్నేహానికి ఎలా పునాది వేసిందో తెలుసుకుందాం.
Kate Winslet Titanic Secret: ప్రపంచ సినిమా చరిత్రలో ‘టైటానిక్’ ఒక అద్భుతం. అందులో జాక్, రోజ్ పాత్రల్లో నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లెట్ కెమిస్ట్రీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. అయితే, ఈ సినిమా షూటింగ్ మొదటి రోజే నటి కేట్ విన్స్లెట్.. హీరో లియోనార్డోకు ఒక ఊహించని షాక్ ఇచ్చిందని, ఆ సంఘటనే వీరి మధ్య దశాబ్దాల నాటి గాఢమైన స్నేహానికి పునాది వేసిందని చాలా కాలం తర్వాత ఒక ఆసక్తికరమైన నిజం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా నటీనటులు పరిచయం కావడానికి సమయం పడుతుంది, కానీ కేట్ మాత్రం మొదటి రోజే ‘ఐస్ బ్రేక్’ చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది.
మొదటి రోజు షూటింగ్... ఆనాటి క్రేజీ సంఘటన
సినిమా షూటింగ్ ప్రారంభమైన కొత్తలో వీరిద్దరి మధ్య అంతగా పరిచయం లేదు. కానీ దర్శకుడు జేమ్స్ కెమెరాన్ ఇద్దరికీ ఒక పెద్ద పరీక్ష పెట్టాడు. సినిమాలోనే అత్యంత కీలకమైన సీన్.. రోజ్ బొమ్మను జాక్ గీసే ఘట్టం. ఈ సీన్ కోసమే కేట్ విన్స్లెట్ నగ్నంగా నటించాల్సి వచ్చింది. చిత్ర విచిత్రంగా దర్శకుడు ఈ సీన్‌ను షూటింగ్ మొదటి రోజే ప్లాన్ చేశాడు. ఏ నటికైనా మొదటి రోజే కో-స్టార్ ముందు అలా నటించడం నరాలు తెగే ఉత్కంఠను కలిగిస్తుంది. కానీ కేట్ భిన్నంగా ఆలోచించింది. ఎలాగూ షూటింగ్‌లో లియోనార్డో తన శరీరాన్ని చూడబోతున్నాడు కాబట్టి, ముందే ఆ బెరుకు పోవాలని భావించింది. షూటింగ్ స్పాట్‌లోకి వెళ్లడానికి ముందే కేట్ హఠాత్తుగా లియోనార్డో ముందుకు వెళ్లి తన దుస్తులను తొలగించి అతనికి సర్ ప్రైజ్ ఇచ్చింది. దీనికి లియో అస్సలు సిద్ధంగా లేడు. కానీ కేట్ తీసుకున్న ఈ చొరవతో ఇద్దరి మధ్య ఉన్న బిడియం, బెరుకు ఒక్క క్షణంలో మాయమైపోయాయి.
దశాబ్దాల నాటి స్నేహ బంధం
ఆ రోజు మొదలైన వీరి పరిచయం.. కాలక్రమేణా ప్రపంచంలోనే అత్యుత్తమ స్నేహ బంధంగా మారింది. టైటానిక్ సెట్‌లో ఒకరిపై ఒకరు ప్రాంకులు చేసుకుంటూ గడిపిన వీరు, నేటికీ ఆ బంధాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాలో జాక్ పాత్ర రోజ్ చేతిని వదిలేసి సముద్ర గర్భంలో కలిసిపోవచ్చు.. కానీ నిజ జీవితంలో మాత్రం లియోనార్డో ఎప్పటికీ కేట్ చేతిని వదలలేదు. అందుకే కేట్ విన్స్లెట్ ఇప్పటికీ లియోను ప్రపంచంలో బెస్ట్ ఫ్రెండ్‌గా చెబుతుంది. మొదటి రోజు షూటింగ్ లో ఆ బెరుకును వదిలించుకోవడానికి కేట్ చేసిన ఆ క్రేజీ పనే.. నేడు హాలీవుడ్‌లోనే అత్యంత గొప్ప స్నేహ బంధానికి దారితీసింది. ఇటీవలే ఈ సంఘటనను కేట్ రివీల్ చేయడంతో సినీ అభిమానులు షాకయ్యారు. కేట్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని అభిమానులు స్వాగతించారు.




